Kadiyam Srihari: కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రారు.. నిలదీసిన కడియం శ్రీహరి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను తాను తెలంగాణ జాతిపితగా చెప్పుకొంటున్న కేసీఆర్.. ప్రస్తుత ప్రజా సమస్యలపై స్పందించకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులంతా రకరకాల అక్రమాలకు పాల్పడి, ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుపోయారని కడియం (Kadiyam Srihari) విమర్శించారు. ఏకంగా కూలిపోయే స్థితిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి తెలంగాణను దివాలా తీయించారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి ఉన్న వేల కోట్ల ఆస్తులు కష్టపడి సంపాదించినవేనా అని ఆయన ప్రశ్నించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అధికారం కోల్పోయినా కేసీఆర్‌లో అహంకారం మాత్రం తగ్గలేదని ఎద్దేవా చేసిన కడియం (Kadiyam Srihari).. ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కలిసి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.











































































