ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు..ఈ 3 పదార్థాలతో చర్మం మెరిపించండి..

20th February 2026

White Scribbled Underline

ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో చర్మానికి సహజ కాంతిని తీసుకురావచ్చు. ఖరీదైన క్రీములు అవసరం లేకుండా సింపుల్‌గా స్కిన్ కేర్ చేయొచ్చు.

మొదటగా పసుపు ఎంతో ఉపయోగకరం. కొద్దిగా పసుపులో పాలు లేదా పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం శుభ్రంగా మారుతుంది. మచ్చలు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

తేనె కూడా మంచి నేచురల్ మాయిశ్చరైజర్. తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.

సెనగ పిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. చెనగ పిండిలో  కొద్దిగా నీరు లేదా రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి వాడితే గ్లో పెరుగుతుంది.

ముల్తానీ మట్టి చర్మంపై ఉన్న అదనపు నూనెను (Excess Oil) పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రంధ్రాలను శుభ్రపరచి, మొటిమలు రాకుండా నిరోధిస్తుంది. 

కాఫీ పొడి మృతకణాలను తొలగించి, రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది తక్షణమే అలసటను తగ్గించి, ముఖానికి సహజమైన కాంతిని ఇస్తుంది.

ఈ మూడు వస్తువులు చర్మానికి హాని చేయకుండా సహజ కాంతిని అందిస్తాయి. అయితే వారానికి రెండు సార్లు మాత్రమే వాడటం మంచిది.

సహజ పదార్థాలతో క్రమంగా జాగ్రత్త తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మార్కెట్లో దొరికే కెమికల్ క్రీమ్స్ కంటే హోమ్ రెమెడీస్ స్కిన్ ప్రొటెక్షన్ కి బెస్ట్

చర్మం లోపలి నుండి మెరవాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం. ఇది చర్మాన్ని తేమగా ఉంచి, ముడతలు పడకుండా కాపాడుతుంది.