Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ కు రంగం సిద్దం

గత 5 ఏళ్ళ నుంచి సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు లో ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్ కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తోన్న.. సిట్(SIT).. ఆయన భార్య లక్షిదుర్గ కూడా ఉనట్లు నిర్ధారించిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్ళింది. కేసులో ఆమె ను ఏ 2 గా రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టులో అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసింది సిట్. 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య, మృతదేహాన్ని తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అప్పగించడంపై అప్పట్లో సంచలనం అయింది.
సి సి ఫుటేజ్ లు, కాల్ రికార్డులు(Call Record), సాంకేతిక ఆధారాలను సిట్ అధికారులు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఎమ్మెల్సీని త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అనంత బాబు భార్యని విచారణకు పోలీసులు పిలిచారు. ఇక ఇప్పటికే హైకోర్టు(High Court)లో ముందస్తు బెయిలు పిటిషన్ ను లక్ష్మీ దుర్గ దాఖలు చేసారు. ఇదిలా ఉంటే.. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ సకాలంలో పూర్తి చేయకపోవడంపై ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 18లోగా అభియోగాల నమోదు పూర్తిచేసి, సాక్షుల విచారణ, ఇతర అంశాలు ఆగస్టు 31లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. నవంబర్ 30 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.











































































