Punarnavi: ఘనంగా బిగ్‌బాస్ పునర్నవి నిశ్చితార్థం

తెలుగు ఆడియన్స్ కు సుపరిచిత నటి పునర్నవి భూపాలం లైఫ్ లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇటీవలే తన ప్రేమను అధికారికంగా వెల్లడించిన ఆమె, ఫిబ్రవరి 19న ఇరు కుటుంబాల సమక్షంలో హేమంత్ వర్మతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుక సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆత్మీయంగా జరిగింది. ఈ సందర్భంగా లగ్న పత్రిక కూడా రాసుకున్నట్లు సమాచారం.
ఉయ్యాల జంపాల సినిమాతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన పునర్నవి, మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం బిగ్‌బాస్‌నే. ఆ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో అమ్మడు నడిపిన లవ్ ట్రాక్ అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ తమ తమ దారులు చూసుకున్నారు.

ఇప్పుడు పునర్నవి లైఫ్ పార్టనర్‌గా సెలెక్ట్ చేసుకున్న హేమంత్ వర్మ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా, ట్రావెలర్‌గా గుర్తింపు పొందారు. వీరిద్దరూ చాలా కాలంగా లవ్ లో ఉన్నారని, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా పునర్నవి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
https://www.instagram.com/p/DU71D3IEXxl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==











































































