The Kerala Stoy2: ది కేరళ స్టోరీ2 రిలీజ్ కు సెన్సార్ క్లియరెన్స్

వివాదాల మధ్య మరోసారి డిస్కషన్ కు పాయింట్ గా మారిన ది కేరళ స్టోరీ2(the kerala story2) రిలీజ్ కు మార్గం సుగమమైంది. రీసెంట్ గా సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా మనోజ్ బాజ్పేయి(manoj bajpayee) సినిమా ఘూస్ఖోర్ పండత్(ghooskor pandat) టైటిల్పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఈ సినిమాపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేయడంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. 14 ఏళ్లు పైబడిన వారు పెద్దల పర్యవేక్షణలో ఈ సినిమాను చూడొచ్చని చిత్రబృందం అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా ది కేరళ స్టోరీ2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత విపుల్ అమృత్లాల్ షా(Vipul Amrutlal Shah) మాట్లాడుతూ, తమ కథలోని నిజాయితీని సెన్సార్ బోర్డు గుర్తించిందని తెలిపారు. బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా యువతులకు మరియు కుటుంబాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించామని చెప్పారు. మత మార్పిడి లాంటి సున్నితమైన అంశాలను టచ్ చేసినప్పటికీ, సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవాలను చూపించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ మూవీపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్(Pinarai vijayan) ఇప్పటికే ఈ సినిమాను తీవ్రంగా విమర్శిస్తూ, ఇది రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఉన్న విద్వేషపూరిత ప్రోపగాండాగా అభివర్ణించారు. కేరళ లౌకిక సంప్రదాయాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నమని కూడా ఆయన ఆరోపించారు. కామఖ్య నారాయణ్ సింగ్(kamakhya narayana singh) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా(Ulka gupta), అదితి భాటియా(Aditi Bhatia), ఐశ్వర్యా ఓజా(Aishwarya bhatia) ముఖ్య పాత్రల్లో నటించారు. రిలీజ్ కు ముందే వివాదాలతో చర్చనీయాంశమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి











































































