CM Revanth Reddy: హైదరాబాద్‌ను ‘ఏఐ క్యాపిటల్’గా మారుస్తాం.. టెక్ దిగ్గజాలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం!

Revanth Reddy:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వచ్చే విప్లవాత్మక మార్పులను భారత్ అందిపుచ్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ‘భారత్ ఏఐ సమ్మిట్-2026’లో పాల్గొన్న ఆయన, ఏఐ అభివృద్ధి, నియంత్రణపై పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేశారు.
హైదరాబాద్‌ను ఏఐ హబ్‌గా మారుస్తాం:
ఏఐ పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని, అందుకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రదేశమని సీఎం పేర్కొన్నారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో సకల వసతులతో ‘ఏఐ వర్సిటీ‘ని అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.
అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు తమ పెట్టుబడులతో హైదరాబాద్‌కు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు.
కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
దేశంలో ఏఐ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఒక ‘ఏఐ కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు.
ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి నగరాల్లో ఇటువంటి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
భారతీయ ప్రతిభపై వ్యాఖ్యలు:
ప్రస్తుతం ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా ఉన్నారని, అయితే ఆ సంస్థలు మనవి కాకపోవడం విచారకరమని రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక, సాఫ్ట్వేర్ విప్లవాల తరహాలోనే ఇప్పుడు నడుస్తున్న ఏఐ శకంలో భారత్ తన సొంత స్టార్టప్‌లను ప్రోత్సహించి అగ్రస్థానానికి చేరాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం వంటి కీలక విభాగాల్లో ఏఐ టెక్నాలజీ సామాన్యుల జీవితాలను మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి










































































