Kajal Agarwal: హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్ ను ప్రారంభించిన రిలీఫ్ వెల్నెస్
ప్రఖ్యాత హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్ “రిలీఫ్ వెల్నెస్” (Releaf Wellness) భారతదేశ వెల్నెస్ మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలిసారి “స్మాల్-మాలిక్యూల్ హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్” ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ 5,000 సంవత్సరాల ఆయుర్వేద జ్ఞానానికి, ఆధునిక ఫార్మాస్యూటికల్ సైన్స్‌ను అనుసంధానించే విప్లవాత్మక విధానాన్ని తీసుకువచ్చింది. ఆధునిక పద్ధతులైన “లిపోసోమల్ మరియు నానో-డెలివరీ టెక్నాలజీ”లను ఉపయోగించడం ద్వారా, సంప్రదాయ హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్‌తో పోలిస్తే 20 నుండి 30 రెట్లు అధిక శోషణను సాధించినట్టు రిలీఫ్ వెల్నెస్ తెలిపింది. దీని వల్ల క్లినికల్-గ్రేడ్ ప్రభావశీలతతో సహజ పరిష్కారాలను అందించగలుగుతున్నట్టు వెల్లడించింది.
రిలీఫ్ వెల్నెస్ అభివృద్ధి చేసిన “స్మాల్-మాలిక్యూల్ హెర్బల్ ఫార్ములేషన్” విధానం కణ స్థాయిలో పనిచేస్తుంది. ఈ విధానంలో నిర్దిష్ట చికిత్సా సమ్మేళనాలను (specific healing compounds) మాలిక్యూలర్ స్థాయిలో గుర్తించి, వేరుచేసి, వాటిని లిపోసోమల్ నానో-క్యారియర్స్ ద్వారా నేరుగా కణాలకు చేరేలా చేస్తుంది. దీంతో బయో అవైలబిలిటీ అధికంగా ఉంటుందని, తద్వారా చర్యలు వేగవంతంగా జరగడంతో పాటు ఆధునిక అలోపతి ఔషధాలకు సమానమైన ప్రభావశీలత సాధ్యమవుతుందనీ సంస్థ వెల్లడించింది.
కీళ్లు మరియు ఎముకల ఆరోగ్యం, మెటాబాలిక్ వెల్నెస్, జ్ఞాపకశక్తి, మహిళల ఆరోగ్యం, జీర్ణక్రియ, నిద్ర, రోగనిరోధక శక్తి, ఒత్తిడి నిర్వహణ వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలకు (lifestyle health concerns) రిలీఫ్ వెల్నెస్ ఉత్పత్తులు పరిష్కారం చూపుతాయి.
రిలీఫ్ వెల్నెస్ స్థాపకుడు శ్రీ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మేము కేవలం మరో ఆయుర్వేద బ్రాండ్ కాదు,” అని అన్నారు. “హెర్బ్స్‌ను ఫార్మాస్యూటికల్ ఔషధాల స్థాయిలో వేగంగా, ప్రభావవంతంగా పనిచేయించేలా చేయగలమా? అనే ప్రశ్నతో తొమ్మిది సంవత్సరాలు పరిశోధన చేశాం. ఫలితంగా మా స్మాల్-మాలిక్యూల్ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఇది ఆయుర్వేద జ్ఞానాన్ని క్లినికల్ పనితీరుగా మార్చుతుంది. మా టెక్నాలజీ ఆయుర్వేదానికి ప్రత్యామ్నాయం కాదు.. దాని పనితీరును మరింత పెంచుతుంది. మొక్కల నుండి ఖచ్చితమైన, వ్యక్తిగతీకరించిన, శక్తివంతమైన వైద్యం మా విధానంలో సాధ్యం అవుతుంది. ప్రకృతిలో అసాధారణమైన చికిత్సా శక్తి ఉంది; దాన్ని సరిగ్గా వెలికితీయడానికి మేము కృషి చేస్తున్నాము.” అని వివరించారు.
ఇవి కూడా చదవండి
సంస్థ CEO శ్రీ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ “ప్రస్తుతం వెల్నెస్ విభాగం ఒక కీలక దశలో ఉంది” అని పేర్కొన్నారు. వినియోగదారులు ఇకపై నెమ్మదిగా పనిచేసే సహజమైన హెర్బల్ ఉత్పత్తులను, ప్రభావవంతమైనవే అయినా రసాయనిక ఔషధాలను అంగీకరించే పరిస్థితుల్లో లేరని అన్నారు. “వినియోగదారులు సహజ ఔషధాలను మరియు ఫార్మాస్యూటికల్ స్థాయిలో ప్రభావాన్ని కలిపిన పరిష్కారాలను కోరుతున్నారు. రిలీఫ్ వెల్నెస్ ఆ అడ్డంకిని తొలగించింది. హెర్బల్ ఉత్పత్తులను ఫార్మాస్యూటికల్ పనితీరుతో అందిస్తోంది.” అని వివరించారు.
బ్రాండ్ ప్రారంభ వేడుకకు ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హాజరై మాట్లాడుతూ, “రిలీఫ్ ఫిల్‌నెస్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు ప్రత్యేకంగా అనిపించింది ఏమిటంటే.. ఇది భారతదేశపు ప్రాచీన ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో ఎంతో సహజంగా కలిపింది. ఇప్పుడు వెల్నెస్ విశ్వసనీయంగా మరియు పరిశోధనల ఆధారంగా ఉండాలి. ఆ దిశలో రిలీఫ్ వెల్నెస్ ఒక ముందడుగు. భారత వెల్నెస్ రంగాన్ని మెరుగుపరచే బ్రాండ్‌ను నిర్మించినందుకు రిలీఫ్ వెల్నెస్ స్థాపకుడు డోలేంద్ర ప్రసాద్ మరియు CEO శ్రీ తరుణ్ సింగ్ చౌహాన్‌కు నా అభినందనలు.” అని పేర్కొన్నారు.
భారతదేశపు ప్రముఖ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్ అయిన C-CAMP (Centre for Cellular and Molecular Platforms) వద్ద ఇంక్యుబేట్ చేయబడిన రిలీఫ్ వెల్నెస్ ఉత్పత్తులు, AYUSH మరియు FSSAI ధృవీకరణలను పొందాయి. ఇవి క్లినికల్‌గా పరిశోధించబడి, కఠినంగా పరీక్షించబడ్డాయి.
ఈ ఉత్పత్తులు సాంస్కృతిక ప్రతీకాత్మకతను ఆధునిక డిజైన్‌తో సమన్వయం చేస్తూ.. భగవాన్ ధన్వంతరి పవిత్ర అమృత కలశం స్ఫూర్తితో రూపొందించిన కలశ ఆకారపు సీసాలలో ప్యాకేజింగ్ చేయబడ్డాయి. ఇవి ఆన్లైన్లో మరియు భారతదేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వెల్నెస్ రిటైలర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. క్లినికల్ పరిశోధన ఆధారిత హామీతో మరియు పారదర్శక పదార్థాల వివరాలతో ఈ ఉత్పత్తులు వినియోగదారులకు అందించబడుతున్నాయి.
ఇవి కూడా చదవండి








