రాయల్ లుక్ లో మెరిసిపోతున్న నభా
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్(Nabha Natesh), తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తర్వాత కెరీర్లో అనుకోని కారణాలతో గ్యాప్ తీసుకున్న నభా, ఇప్పుడు తిరిగి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అయితే కెరీర్లో తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంది. తాజాగా నభా రోజ్ పింక్ కలర్ లెహంగా, దానికి తగ్గట్టుగా హెవీ జ్యువెలరీ ధరించి రాయల్ లుక్ లో ఎంతో అందంగా మెరిసింది. ఈ అవుట్‌ఫిట్ లో నభా గ్లామర్ మరింత ఎట్రాక్టివ్ గా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు.








