రెండో విడత భూ సమీకరణపై రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం
తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం భేటీ. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కౌలును ప్రకటించిన ముఖ్యమంత్రి. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు. కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి సీఎం అంగీకారం. ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచేందుకు అంగీకరించిన సీఎం చంద్రబాబు.








