Bill Gates: అమరావతికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిట్ గేట్స్ (Bill Gates) ఈ నెల 18న అమరావతి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో సమావేశమై, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏఐ (AI) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు వీలుగా గత ఏడాది మార్చిలో బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఆరోగ్య సేవల ఎనలిటిక్స్, డిజిటల్ వ్యవసాయం, పాలనలో సాంకేతికత వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు అమలుపై ఇరువురి మధ్య జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు అమరావతి (Amaravati) క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే ప్రతిపాదన ఉందన్న ప్రచారం ఉంది. దీనిపైనా అదేరోజు స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






