బిట్స్ క్యాంపస్ లో 2027 నుంచి అడ్మిషన్లు
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( బిట్స్) క్యాంపస్ లో 2027 నుంచి అడ్మిషన్లు (Admissions) ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెలిపారు. సచివాలయంలో వారు సీఎంను కలిసి, తమ క్యాంపస్ నిర్మాణ పురోగతిని వివరించారు. అమరావతిలో ఏర్పాటవుతున్న తమ క్యాంపస్ లో క్వాంటమ్ (Quantum), ఏఐ (AI) విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో స్టార్ట్‌పలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వారికి సూచించారు. ఐకానిక్, ఏఐ క్యాంపస్ గా అమరావతి (Amaravati) బిట్స్ పిలాని నిర్మిస్తున్నామని వారు తెలిపారు. మూడు దశల్లో క్యాంపస్ నిర్మిస్తామని, 10వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం అమరావతి క్యాంపస్ లో ఉంటుందని వివరించారు. అమరావతి క్యాంపస్ సహా సంస్థ విస్తరణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








