సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశమైన బిట్స్ పిలాని ప్రతినిధులు
• రాజధాని ప్రాతంలో నిర్మితం అవుతున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించిన ఆ సంస్థ ప్రతినిధులు
• రాజధానిలో నిర్మిస్తున్న క్యాంపస్ లో క్వాంటం, ఏఐ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపిన బిట్స్ పిలాని ప్రతినిధులు
• క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
• ఐకానిక్, ఏఐ క్యాంపస్ గా అమరావతి బిట్స్ పిలాని క్యాంపస్ ను నిర్మిస్తున్నట్టు వెల్లడి.
• 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని సీఎంకు వివరించిన బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు
• రాజధాని ప్రాంతంలోని క్యాంపస్ సహా సంస్థ విస్తరణ కోసం రూ.250 కోట్ల మేర వ్యయం చేయనున్నట్టు తెలిపిన బిట్స్ పిలాని ప్రతినిధులు
• మూడు దశల్లో బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపిన ఆ సంస్థ ప్రతినిధులు.
• మొత్తం 10 వేల మంది విద్యార్ధులు చదువుకునేలా క్యాంపస్ నిర్మిస్తున్నట్టు వెల్లడి









