ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆగస్టు 5న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 18న నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేష్ల పరిశీలన కాగా ఉపసంహరణ తేదీ 21. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపరాష్ట్ర పదవికి ఎన్నిక అనివార్యమయితే ఆగస్టు 5న జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఇసీ వెల్లడించింది. ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఆధికార ఎన్డీఏ లేదా ప్రతిపక్షాలు ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆగస్టు 10వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. అన్నారీ రెండు పర్యాయాలు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. ఎన్డీఏకు లోక్సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభ విషయానికి వస్తే ప్రతి పక్షాల మద్దతు కూడగట్టడంలో సఫలీకతమైంది. కాబట్టి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇదే వ్యూహంతో ముందుకెళ్లి తమ అభ్యర్థినికి గెలిపించుకోవాలని యోచనలో అధికార ఎన్డిఏ ఉంది.













