ఏకపక్షంగా తీసుకున్నారని నిరూపిస్తే తదుపరి చర్యలు : జ్ఞానేష్ కుమార్ విషయంలో సుప్రీం
సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. జ్ఞానేష్ కుమార్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పత్రిక కథనం ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ పై ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. మిగిలిన అధికారులకు రాజ్యాంగబద్ధంగా కేటాయించిన అధికారాలను జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వినియోగించుకోవచ్చా? లేదా? అన్న విషయాన్ని మాత్రం పరిశీలిస్తామని తెలిపింది.
అంత కంటే ముందు ఈ వార్తలపై ఎన్నికల సంఘం స్పందనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ కి నోటీసులిచ్చింది. ఓట్ల తొలగింపు నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా తీసుకున్నారని నిరూపిస్తే.. తదుపరి చర్యలకు ఆదేశిస్తామని సుప్రీం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
అయితే.. ఈ అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో మాత్రమే జరగాలని ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాల రద్దు చేయాలని కోరారు. ‘CEC & ECs Act’ ప్రకారం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో జరగాలి అని అన్నారు. సీఈసీ ఒంటరిగా నిర్ణయించలేరని స్పష్టం చేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పక్కన పెట్టి నిర్ణయాలు అమలు చేశారని ఆరోపించారు.








