కిరణ్ అబ్బవరం కొత్త అవతారం..! ‘రియాలిటీ’తో డైరెక్టర్‌గా ఎంట్రీ
మాస్ హీరోయిజం, భారీ యాక్షన్ సీన్స్ కే పరిమితం కాకుండా.. ఓ సాధారణ కుటుంబం ఎదుర్కొనే బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లను తెరపై చూపించే ప్రయత్నంగా రియాలిటీ(Reality) కనిపిస్తోంది
ఇదే సమయంలో ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి మరో విధంగా కీలకమైన సినిమా. హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కిరణ్… ఈసారి రచన, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టి తనలోని మరో కోణాన్ని ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు. అందుకే ఈ సినిమా రిజల్ట్ నటుడిగా మాత్రమే కాకుండా రైటర్, డైరెక్టర్‌గా కిరణ్ సామర్థ్యానికి కూడా ఒక పరీక్షగా మారనుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలోని సిట్యుయేషన్స్, క్యారెక్టర్స్, ఎమోషన్స్ సహజత్వానికి దగ్గరగా ఉండేలా కనిపిస్తున్నాయి. తెరపై ఓ సినిమా చూస్తున్నామనే కంటే.. మన చుట్టూ జరిగే జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలిగించే ప్రయత్నం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇక రియాలిటీ రిలీజ్ డేట్ కూడా సినిమాకు కలిసొచ్చే అంశంగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా హాలిడే సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌ను కథలో ప్రధానంగా ఉంచినట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో(bheems ciciroleo) మ్యూజిక్, భారీ నిర్మాణ విలువలు ఈ ప్రపంచానికి మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నంలో షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. క్రిస్మస్ బరిలో రియాలిటీ ఎలాంటి అనుభూతిని అందించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.








