సీఎం విజయ్ కు తొలిపరీక్ష..
ధరాపురం ఉపఎన్నికల పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరీముఖ్యంగా సీఎం విజయ్ కు అయితే.. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పొరపాటున అధికార పార్టీ అభ్యర్థి ఓడితే.. అది ప్రభుత్వంపైనా, టీవీకేపైనా పెను ప్రబావం చూపిస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని విజయ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా టీవీకే అభ్యర్థి సత్యభామపై.. డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఆయుధంలా మార్చుకుంటున్నారు విజయ్. సత్యభామను స్టాలిన్.. సత్యభామ కాదు.. సూట్ కేస్ భామ అంటూ సెటైర్ వేశారు.దీన్ని మహిళలందరికీ అవమానమంటూ విజయ్.. రాజకీయంగా అస్త్రంలా మార్చారు. ఆమెకు ఓ అన్నగా , తండ్రిగా, బంధువుగా అండగా నిలుస్తామన్నారు.ఎన్నికల ప్రచార అంశాలను పక్కనపెట్టి, ఒక మహిళా అభ్యర్థి శరీర ఆకృతిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. మహిళలపై డీఎంకే నేతలు అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది డీఎంకే పార్టీలో పాతుకుపోయిన విద్వేష, అసభ్యకరమైన సంస్కృతిని ప్రతిబింబిస్తోందని ఆయన ఆరోపించారు.








