America-Israel: అమెరికా, ఇజ్రాయిల్ మధ్య విభేదాలు..?
ఇరాన్(Iran) యుద్ధం విషయంలో ఇప్పటి వరకు ఏకతాటి మీదున్న అమెరికా, ఇజ్రాయిల్ మధ్య విభేదాలు తలేత్తాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా వైట్ హౌస్ లో యుద్ధంపై అత్యవసరంగా భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump), ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Netanyahu) మధ్య విభేదాలు తలెత్తాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడి చేయడంతో, ఇరాన్ దాడులకు దిగింది. ఖతార్(Qatar) లోని కీలక గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. దీనితో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారట.
జపాన్(Japan) ప్రధాన మంత్రి సనాయ్ తకైచీతో ఇటీవల ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో, ఇరాన్.. కీలక గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేయడంపై, నెతన్యాహుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ దాడిని తాను అసలు ఊహించలేదు అని ట్రంప్ కామెంట్ చేసినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది. దాడి గురించి అసలు తనకు సమాచారం లేదని కూడా ట్రంప్ కామెంట్ చేసారట. ఇక నుంచి దాడులు జరపవద్దని తాను నెతన్యాహును కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. తాము కలిసే ఉంటాం అని, కాని ఒక్కోసారి ఇజ్రాయిల్ ఇష్టారీతిన వ్యవహరిస్తోందని, తనకు అది నచ్చకాపోతే ఇజ్రాయిల్ అలా చేయదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయాలన్న తన నిర్ణయంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేసారు. నెతన్యాహుకు ఇరాన్ నాయకత్వాన్ని అస్థిరపరచడం, మధ్యప్రాచ్యాన్ని పునర్నిర్మించడం ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తుండగా, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడంపైనే ట్రంప్ దృష్టి కేంద్రీకృతమై ఉంది. అమెరికా ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకోగా, ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ అగ్ర నాయకుల మీద ఫోకస్ చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్‌కు, ప్రపంచానికి ప్రమాదకరమని నేను 40 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాను అంటూ నెతన్యాహు వ్యాఖ్యానించగా, దాడులు చేసే విషయంలో విజ్ఞత ముఖ్యమని, గ్యాస్ ధరలు పెరగడం కరెక్ట్ కాదని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి








