విదేశాల్లో సీతారాముల కల్యాణం
ప్రపంచవ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల 1 నుంచి ఈ వేడుకలను ఆరంభించి నెలపాటు జర్మనీ, అమెరికా, కెనడా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలోని 9 ప్రాంతాల్లో కల్యాణాలు నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లోని సంస్థల తరపున అందిన విజ్ఞప్తి మేరకు దేవాదాయశాఖ సూచనలతో భద్రాచలం నుంచి ఇద్దరు అర్చకులు బయలుదేరారు.








