తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఎంపీలతో కీలక బిల్లుల ఆమోదం? సర్కార్ వ్యూహం
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహ, ప్రతి వ్యూహాలతో అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. 5 కొత్త బిల్లుల ఆమోదమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థిక, న్యాయ సంస్కరణ దిశగా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో వుంది. మరో వైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్షాలున్నాయి.
ప్రభుత్వం అనుసరించే వ్యూహం ఇదే…
విపక్షాలు ఇరుకున పెట్టినా, బిల్లులను అడ్డుకున్నా.. ఓ వ్యూహంతో ముందుకు సాగాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. తమ తమ పార్టీల్లో తిరుగుబాటు బావుగా ఎగరేసి, బయటికి వచ్చిన ఎంపీలపై దృష్టి పెట్టింది సర్కార్. వారి మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమైంది సర్కార్. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన 20 మంది ఎంపీలు.. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫణ్ ఇండియాలో చేరారు. ఆ పార్టీ ఇప్పుడు ఎన్డీయేకి మద్దతిస్తోంది.
మరో వైపు మహారాష్ట్రలోని శివసేన యూబీటీలో కూడా ముసలం పుట్టింది. ఆరుగురు ఎంపీలు ఎన్డీయే కూటమిలో చేరారు. వారికి లోకసభ స్పీకర్ అనుబంధ గుర్తింపు కూడా అధికారికంగా ఇచ్చేశారు. వీరితో పాటు ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసహ సభ్యులు బీజేపీలో చేరారు. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయేకి లభించినట్లైంది.ఈ ఎంపీల ద్వారా బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం వుంది.








