Narendra Modi: కాంగ్రెస్ ఒక ‘రాజకీయ రాబందు’.. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు: మోదీ
Narendra Modi: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుజరాత్లోని వావ్-థరాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కాంగ్రెస్ ‘రాజకీయ రాబందు’లా కాచుకుని కూర్చుందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం:
ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతుంటే, కాంగ్రెస్ మాత్రం ఆ పరిస్థితులను అవకాశంగా మార్చుకుని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని మోదీ మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరేలా చేసి, దేశంలో అస్థిరత తీసుకురావాలని ఆ పార్టీ కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.
సంక్షోభాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉంది:
ప్రపంచ దేశాలన్నీ ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్నప్పటికీ, భారత్ తన పటిష్టమైన విదేశాంగ విధానంతో సమర్థవంతంగా ముందుకు సాగుతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సుమారు 10 శాతం పెరిగినప్పటికీ, ఆ భారం సామాన్యులపై పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి భారత్కు ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి








