TRUMP – EU: నాటో పేపర్ టైగరా..?.. ట్రంప్ ఆగ్రహావేశాలు..!
ట్రంప్ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేరు . ఆయనకు నచ్చితే చంకనెక్కించుకుంటారు. కోపమొచ్చిందో విసిరి అవతల కొడతారు. ఇప్పుడు మిత్రదేశాల కూటమి అయినా నాటోపై ట్రంప్ ఆగ్రహించారు. తాము యుద్ధంలోకి రావాలని పిలిస్తే నాటో రాదా..? వారి భద్రతకు మేం సాయం చేయాలి.. కానీ వారు మాత్రం.. మాకు అవసరమైనప్పుడు హ్యాండిస్తున్నారన్నది ట్రంప్ ఆవేదన.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సభ్యదేశాల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తంచేశారు. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు కలిసి రావాలన్న ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంపై ఆయన చిర్రుబుర్రలాడారు. పిరికివాళ్లంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భాన్ని గుర్తు పెట్టుకుంటాని హెచ్చరిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడి నేపథ్యంలో చమురు రవాణాకు జీవనాడి నాటి లాంటి హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ అవాంతరాలు సృష్టిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. కొన్ని దేశాలు చమురు, గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ను తిరిగి తెరిపించేందుకు కలిసి రావాలని డొనాల్డ్ ట్రంప్.. నాటో దేశాలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఏ దేశమూ ముందుకు రాకపోవడం ట్రంప్‌నకు కోపం తెప్పించింది.
‘‘అమెరికా లేకపోతే నాటో కేవలం ఒక పేపర్ టైగర్ మాత్రమే. అణ్వాయుధ శక్తిగా మారుతున్న ఇరాన్‌ను అడ్డుకునే పోరాటంలో పాల్గొనడానికి అప్పుడు సుముఖత చూపలేదు. కానీ, ఇప్పుడు అధిక ధర చెల్లించాల్సి వస్తుండడంతో చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి కారణమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అవసరమైన సైనిక చర్యకు మాత్రం ముందుకు రావడం లేదు. పిరికివాళ్లు. గుర్తు పెట్టుకుంటా!’’ అంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి








