Iran: అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తామన్న ఇరాన్
Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే ఆ రెండు దేశాలకు ఊహించని విధంగా ‘బిగ్ సర్ ప్రైజ్’ ఇవ్వబోతున్నామని ఇరాన్ ఉన్నత స్థాయి భద్రతాధికారి ఒకరు వెల్లడించారు. తమ సొంత వ్యూహాలు, నిర్దిష్ట ప్రణాళికల ప్రకారమే యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యం:
ఇరాన్ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఇరాన్ పేర్కొంది. గతంలో అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడాన్ని ప్రస్తావిస్తూ, వారి సైనిక చర్యలు ఇప్పటికే విఫలమయ్యాయని ఇరాన్ అధికారులు గుర్తు చేశారు.
హర్మూజ్ అల్టిమేటంపై స్పందన:
48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరవాలని, లేదంటే నరకం చూపిస్తామని ట్రంప్ జారీ చేసిన అల్టిమేటంను ఇరాన్ కొట్టిపారేసింది. దీనిని ఒక తెలివితక్కువ చర్యగా అభివర్ణించింది. శత్రువులు తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగితే అత్యంత తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన నెలకొంది.








