Iran – America: ఇరాన్-అమెరికా మధ్య భారీ డీల్..? ఇజ్రాయిల్ మీడియా సంచలనం..!
ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపధ్యంలో.. ఇజ్రాయిల్(Israel) మీడియా చేసిన, ఒక సంచలన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు, నయా సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మధ్య రహస్య చర్చలు జరగనున్నాయని ఇజ్రాయిల్ మీడియా రాసుకొచ్చింది. ఇరాన్ క్షిపణి దాడులు, అమెరికా ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారిన వేళ, తెరవెనుక ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోందని తెలిపింది.
ప్రస్తుతం సుప్రీం లీడర్ గా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) నేరుగా డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరపబోతున్నారని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు ఇదొక చివరి ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థల కథనం ప్రకారం.. ఇరాన్ పతనం అంచున ఉన్న తరుణంలో, మొజ్తాబా ఖమేనీ స్వయంగా రంగంలోకి దిగారని తెలిపింది. ట్రంప్ విధించిన 48 గంటల గడువు, చమురు ఆంక్షల నేపథ్యంలో.. దేశాన్ని కాపాడుకోవడానికి అమెరికాతో నేరుగా చర్చలు జరపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని వివరించింది.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే టర్కీ లేదా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలకు ముహూర్తం ఖరారైందని వార్తలు వస్తున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ వారంలోనే పాకిస్థాన్‌లో ఇరాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరపవచ్చని, ఈ చర్చలలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, అమెరికా మధ్యవర్తి స్టీవ్ విట్కాఫ్ల మధ్య చర్చలు జరిగాయని ఇజ్రాయెల్ మీడియా సంస్థ యెడియోత్ అహ్రోనోత్ పేర్కొన్నట్లు అరబ్ న్యూస్ తెలిపింది.
గ్లోబల్ సప్లై చైన్ లో ఆటంకాలు, పౌర, సైనిక, ఇంధన మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడంతో ప్రపంచ ఇంధన భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, దీని ప్రభావం పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాలకు ఆవల కూడా వ్యాపిస్తోంది. ఈ కీలక సమయంలో ఖమేని ట్రంప్‌తో చర్చలు జరిపి సఫలమైతే, ఇరాన్ ప్రజల్లో ఆయనకు తిరుగులేని గుర్తింపు వస్తుంది. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని ఆపి, అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








