ఒప్పందానికి రాకుంటే నరకమే.. ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి ఇరాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందానికి రావాలని .. లేదంటే నరకానికి పంపిస్తామని వార్నింగిచ్చారు. అయితే ఈసారి ఏ వైట్ హౌస్ నుంచో కాదు.. ఏకంగాప్రపంచదేశాధినేతల ముందే ఈ హెచ్చరికలు పంపారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు.
‘‘వారికి బతికే అవకాశం లేకుండా, భవిష్యత్తు వైభవం లేదా తరాలపై ఆశ లేకుండా నేను వారిని నరకంలోకి నెట్టేస్తామన్నారు. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌తో ఒప్పందం సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. గత 51 ఏళ్లుగా ఇరాన్ ఛాందసవాద ప్రభుత్వం రక్తపాతం, హత్యల ద్వారా పరిపాలిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ ..పశ్చిమాసియా అంతటా.. దాని వెలుపల కూడా మరణం, విధ్వంసం, గందరగోళాన్ని సృష్టించిందన్నారు. ఒకప్పుడు ఇరాన్ పశ్చిమాసియాను బెదిరించేదని.. కానీ ఇప్పుడు అలా చేయడం దానికి సాధ్యం కాదన్నారు. ఇరాన్ ఇకపై పెత్తందారు కాదని.. టెహ్రాన్‌కు అణ్వాయుధం సమకూర్చడానికి ఎప్పటికీ అనుమతించబోమని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
ఇరాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. సమావేశం ఇంకా ఖరారు కానప్పటికీ ట్రంప్ మాత్రం హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్








