బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. ఇక వారికి కాలం చెల్లినట్టేనా?
బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. శాన్డియా గోలో జరిగిన ఎఎస్యూ జీఎస్వీ సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్‌బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగు పరుచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మావన ట్యూటర్‌గా చేయలేనతంగా, మంచి ట్యూటర్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాగు మేథ్స్‌లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. చాట్‌బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరుకోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్బాట్లు చదవడం, వ్రాయడంతో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడిరగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత రచనలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్లపై పొగడ్తలు కురిపించారు.








