బీఎల్ఎఫ్ లో మహిళా సైన్యం.. పాకిస్తాన్ కు మరిన్ని చిక్కులు..
బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మరిన్ని యుద్ధ వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే బీఎల్ఎఫ్ దాడులతో పాక్ సైన్యం బెంబేలెత్తుతుంటే.. ఇప్పుడు లేటెస్టుగా మహిళా కంబాట్ యూనిట్ కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్’ (కేఏఏడీ) ఏర్పాటు చేసింది. అంతేకాదు…తమ కొత్త మహిళా కాంబాట్ యూనిట్ ‘కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్’ (కేఏఏడీ) తొలి ఆపరేషన్లలో 9 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు ఆ సంస్థ ప్రకటించుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది.
ఈ నెల 22న టర్బట్ సమీపంలోని సీపెక్ హైవేపై పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బలూచ్ మహిళా ఫైటర్లు దాడి చేశారని బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రామ్ బలోచ్ తెలిపారు.ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మరణించారన్నారు. అలాగే, కలాత్ జిల్లాలోని క్వెట్టా-కరాచీ హైవేపై జరిగిన మరో దాడిలో మరో ముగ్గురు సైనికులు చనిపోయారని, మొత్తం మరణాల సంఖ్య 9 అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లను పురుషుల యూనిట్‌తో కలిసి నిర్వహించినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి
ఈ దాడులకు సంబంధించి బీఎల్ఎఫ్ విడుదల చేసిన వీడియోలో, సుమారు 20 మంది మహిళా ఫైటర్లు భారీ ఆయుధాలతో శిక్షణ పొందుతున్న దృశ్యాలు ఉన్నాయి. వారు చెక్పాయింట్లు ఏర్పాటు చేయడం, దాడులు చేయడం వంటివి చిత్రీకరించారు. “ఇక యుద్ధమే మా విధి. బానిసత్వం చాలు. స్త్రీ, పురుష భేదాన్ని తొలగించాం” అని ఆ యూనిట్ కమాండర్ వీడియోలో పేర్కొన్నాడు.
కెనడాలో మరణించిన బలూచ్ కార్యకర్త కరీమా బలోచ్ పేరు మీద ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 9 మంది సైనికులు మరణించారన్న బీఎల్ఎఫ్ వాదనలను స్వతంత్ర వర్గాలు ధ్రువీకరించలేదు. బలూచ్ తిరుగుబాటు గ్రూపుల్లో మహిళల పాత్ర పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.








