”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్ కోలా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం’ త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం ‘తత్వం’. ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్టోబర్ 2న చిత్రం థ్రియేటికల్ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ ” తత్వం సినిమాను ఎవరు మిస్ కాకండి. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. పాషనేటెడ్ పీపుల్ అంతా లైఫ్ పెట్టి ఈసినిమా చేశారు. మీరు చూసి ఈ మంచి సినిమా గురించి నలుగురుకి చెప్పండి. అందరూ ఇలాంటి సినిమాను ఎంకరైజ్ చేసే బాధ్యత మీపై ఉంది. అందరూ ఈ సినిమాను ఎంతో ఇష్టపడి చేశారు. తప్పకుండా ఈ సినిమా మంచి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు.
దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ ” ఈ సినిమా సమయంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం. మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్కు మళ్లీ మేము వచ్చి సినిమా విడుదల చేస్తాం అని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన సమయంలో హీరో, హీరోయిన్‌కు కారు యాక్సిడెంట్‌కు గురయ్యారు. మళ్లీ వాళ్లు కోలుకునే సరికి టైమ్ పట్టింది. అందుకే మళ్లీ డిలే అయ్యింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అక్టోబర్ 2న విడుదల తేది ప్రకటించాం. ఇప్పుడు సడన్ మా టైమ్‌కి దాదాపు డజను సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో అక్టోబర్ 2న విడుదల చేస్తున్నాం. ఒకవైపు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈ సినిమా పనులు చూసుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్, పాటలు చూసి అందరూ పాజిటివ్ ఆరా ఇచ్చారు. ఓ థ్రిల్లర్ మూవీకి కావాలసిన అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఇచ్చిన స్పందనతోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అక్టోబర్ 2న ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్‌తో కష్టాలన్నీ మరిచిపోతాం’ అన్నారు.
ఇవి కూడా చదవండి
నిర్మాత శీమకుర్తి వంశీ కృష్ణ మాట్లాడుతూ ” చాలా స్ట్రగుల్స్ ఫేసి చేసి ఇక్కడికి వచ్చాం. మేము వెండితెరపై ఈ సినిమా చూసి, ఆడియన్స్ ఆదరణ చూసి ఈ కష్టాలు మరిచిపోతాం. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.
దినేష్ తేజ మాట్లాడుతూ ” ఈ సినిమాకు జరిగిన నెగెటివ్లతో అన్నీ ఈ సినిమాకు దిష్టి పోయింది అనుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ చాలా గట్టిది. ఈ సినిమా ప్రమోషన్ టైమ్‌లో నాకు హీరోయిన్‌కు యాక్సిడెంట్ జరిగింది. నాకు ఇది సెకండ్ లైఫ్. డే వన్ రోజు కథ విన్నప్పుడు నాలో ఎలాంటి నమ్మకం ఉందే ఈ రోజుకు అంతకు మించి ఈ చిత్రం విజయంపై విశ్వాసం ఉంది. ఆడియన్స్‌కు సినిమా తప్పకుండా నచ్చుతుంది. అందరూ నన్ను నీ ఫ్రైడే ఎప్పుడూ నీ టైమ్ ఎప్పుడూ అంటుంటారు.. తప్పకుండా ఈసినిమాతో ఆ రోజు వస్తుంది. నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ మంచి సినిమాల్లో నటిస్తాను. కొత్తదనం ఉన్న సినిమాలు తెలుగు ఆడియన్స్ ఆదరిస్తుంటారు. తప్పకుండా ఈ సినిమాను కూడా అదే కోవలో విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమాకు కథే మా ధైర్యం, ఆడియన్సే మా బలం. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే మా అందరిలో కూడా నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ అందరి మనసులను తాకుతుంది’ అన్నారు.
హీరోయిన్ దష్విక మాట్లాడుతూ ” తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని, మా అందరికి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అన్నారు.








