డబుల్ ఇంజిన్ సర్కార్.. జెట్ స్పీడ్తో : సీఎం చంద్రబాబు
పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
పల్లె పండుగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
• పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలుకుతున్నాం.
• డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మూడు పల్లె పండుగలు నిర్వహించుకున్నాం.. అన్నీ సక్సెస్ అయ్యాయి.
• ఉద్యమ స్పూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా.
• చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ రెండేళ్లల్లో అభివృద్ధి చేస్తోంది. జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాం.
•సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో రాష్ట్రాన్ని నిలబెట్టాం.
• 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు… ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.
• 2024 ఎన్నికల నాటి కంటే ఎన్డీఏ హవా పెరిగింది.
• పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు మహిళలు, ప్రజలు సిద్దంగా ఉన్నారు.
• గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయి.
• నాడు ఎక్కడ చూసినా గుంతలు.. వీధి దీపాలు లేవు.. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టాలన్నా దిక్కు లేని పరిస్థితి.
• నాటి దుస్థితి నుంచి పవన్ కళ్యాణ్ పల్లెలను అభివృద్ధి బాట పట్టించారు.
• కూటమి ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ వేశారు. గ్రామ వికాసంలో భాగంగా పవన్ అనేక మార్పులు తెచ్చారు.
• రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో 13326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టారు. అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
• రెండున్నర దశాబ్దాల తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థలోని వివిధ హోదాల్లో ఉన్న 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు.
• 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4136 కోట్లు విడుదల చేశారు.. లక్షకు పైగా పంటకుంటలు తవ్వించారు… పశువుల కోసం నీటి తొట్టేలు కట్టించారు.
• పంచాయతీ రాజ్ శాఖ 13 జాతీయ అవార్డులు దక్కించుకుంది.
• పవన్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ పేదల కోసం పని చేస్తోంది.
• పొట్టి శ్రీరాములు జల ధార కింద జేజేఎం పనులు ప్రారంభించబోతున్నాం.
• ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ వేస్తున్నాం.
• రోడ్ల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
• పట్టణ ప్రాంతాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం.
• నాటి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లల్లో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లను మాత్రమే వేశారు.
• కూటమి ప్రభుత్వం రెండేళ్లల్లో 6500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసి చరిత్ర సృష్టించాం.
• అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు వైఎస్సార్ పార్టీ దొంగల జేబుల్లోకి వెళ్లాయి.
• ఇప్పుడు ప్రజల కళ్లకు కనబడేలా అభివృద్ధి చేస్తున్నాం.








