ఈ విషయంపై ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే.. కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల (Local elections)పై వస్తున్న వార్తలు (News) నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) స్పష్టం చేసింది. ఎన్నికలు రెండు నెలలు ఆలస్యమవుతాయనే ప్రచారం నిజం కాదని పేర్కొంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా (Media) సమావేశాల ద్వారానే వెల్లడిస్తామన్నారు. ఈ విషయం పై ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.








