పంటనష్టం వివరాలు త్వరగా ఇవ్వండి : మంత్రి అచ్చెన్న
తుపాను (Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆదేశించారు. ప్రతి బాధిత రైతు వివరాలనూ నమోదు చేయాలని సూచించారు. 14 జిల్లాల్లోని 89 మండలాలు (Mandals), 351 గ్రామాల్లో ఉద్యాన పంటలు ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. 1,734 హెక్టార్లలో ఉద్యాన పంటలకు, 190 మండలాల్లోని 1,229 గ్రామాల్లోని 44,029 హెక్టార్ల వ్యవసాయ పంటలకు నష్టం వాటిలినట్లు ప్రాథమిక అంచనా. 71,796 మంది రైతులకు పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ( Agriculture Department) గుర్తించింది అని అన్నారు.








