వైసీపీ చేయలేని పని టీడీపీ చేసి చూపించింది :మంత్రి నిమ్మల
ఫ్లోరైడ్ ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కృష్ణమ్మను తీసుకొస్తే, ఆ నీటిని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు (YCP leaders), గొడ్డలి పార్టీని ఏమనాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ప్రశ్నించారు. అలాంటి పార్టీని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లా (Prakasam District) చీమకుర్తిలో కారుమంచి మేజర్ డ్రైన్ కాలువను మంత్రి నిమ్మల ప్రారంభించారు. అనంతరం జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) చేయలేని పనిని, తాము చేస్తే ఎందుకంత అసహనమని ప్రశ్నించారు.








