రాజమౌళి మాటతో మళ్లీ చర్చల్లోకి సూర్య ప్రాజెక్టు
టాలీవుడ్లోనే కాదు, సౌత్ మూవీని నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లిన డైరెక్టర్లలో ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), నటుల్లో సూర్య(Suriya)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ రెండు పేర్లు మరోసారి కలసి వినిపిస్తున్నాయి. సూర్యతో సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని రాజమౌళి గతంలోనే చెప్పగా, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఈ కాంబినేషన్‌పై ఇంట్రెస్ట్ ను మరింత పెంచాయి. మేము సినిమా చేసినప్పుడు అది చాలా స్పెషల్ గా ఉంటుందంటూ రాజమౌళి చేసిన కామెంట్ తో ప్రాజెక్ట్‌పై కొత్త డిస్కషన్ మొదలైంది. అయితే ఇది కేవలం ఫ్యూచర్ ఛాన్స్ కు సంబంధించిన సంకేతమే తప్ప, సినిమా ఖరారైనట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వెలువడలేదు.
వాస్తవానికి రాజమౌళి- సూర్య కాంబినేషన్ వెనుక చాలాకాలం నాటి పరిచయం, పరస్పర గౌరవం ఉంది. తెలుగు మార్కెట్లో సూర్య సినిమాలకు ఉన్న ఆదరణ రాజమౌళిని కూడా ప్రభావితం చేసిందని గతంలో డైరెక్టర్ వెల్లడించారు. ముఖ్యంగా గజిని(Gajini) టైమ్ లో సూర్య తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ కావడం తన ఆలోచనలపై ప్రభావం చూపిందని ఆయన చెప్పడం ఈ కాంబినేషన్‌కు ఉన్న ప్రత్యేక నేపథ్యాన్ని తెలియజేస్తుంది. అందుకే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది కేవలం మరో స్టార్ కాంబినేషన్‌గా కాకుండా, రెండు భిన్నమైన సినీ ప్రయాణాల కలయికగా మారే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు(mahesh Babu), ప్రియాంక చోప్రా(Priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi raj sukumaran) నటిస్తున్న వారణాసి(Varanasi)పై పూర్తిగా దృష్టి పెట్టారు. మరోవైపు సూర్య కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జీతూ మాధవన్‌తో పాటు టీజే జ్ఞానవేల్(TJ Gnanavel) దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్(Hombale films) నిర్మించే సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. దీంతో వెంటనే ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించకపోయినా, రాజమౌళి తాజా కామెంట్స్ ఫ్యూచర్ లో ఈ ఇద్దరి కలయికకు తలుపులు తెరిచే ఉంచాయి.








