పూరీ ఫోకస్ మారిందా? ఆసక్తి రేకెత్తిస్తున్న స్లమ్టాగ్ గ్లింప్స్
విజయ్ సేతుపతి(vijay sethupathi), డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannath) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog: 33 templte road) పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతున్న వేళ.. పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మరో కీలక గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రముఖ నటి జరీనా వహాబ్ పోషిస్తున్న జుబైదా పాత్రను పరిచయం చేశారు. కథలో ఈ క్యారెక్టర్ కు ఉన్న ఎమోషనల్ డెప్త్ ను గ్లింప్స్ స్పష్టంగా చూపించింది.
గతంలో జీవితంలో ఎదురైన తీవ్ర పరిస్థితులతో జుబైదా రైల్వే స్టేషన్లో తన జీవితాన్ని ముగించుకోవాలని భావిస్తుంది. అయితే ఆ సమయంలో ఆమెను వెంటాడిన ఆకలి.. ఆ డెసిషన్ ను మార్చేలా చేస్తుంది. చివరకు బతకడం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితికి చేరుతుంది. ఈ ఒక్క సీన్ ద్వారా పేదరికం, ఆకలి, బతుకుపోరాటం వంటి అంశాలను పూరి జగన్నాథ్ ఎంత నేచురల్ గా కథలో మిళితం చేశారో అర్థమవుతోంది. జరీనా వహాబ్ తన యాక్టింగ్ తో ఈ సీన్ కు మరింత స్ట్రాంగ్ ఎమోషన్ ను తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇప్పటివరకు యాక్షన్, మాస్ అంశాలతో ఆకట్టుకున్న ఈ సినిమా.. మరోవైపు బలమైన మానవీయ కోణాన్ని కూడా కలిగి ఉందనే సంకేతాలను ఈ గ్లింప్స్ ఇచ్చింది. సినిమాలో విజయ్ సేతుపతి(vijay sethupathi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సంయుక్త(samyuktha) హీరోయిన్గా కనిపించనున్నారు. దునియా విజయ్(Duniya Vijay) కీలక పాత్రలో నటిస్తున్నారు. టబు(Tabu) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటం సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. జేబీ నారాయణరావు(JB Narayanarao), పూరి జగన్నాథ్(Puri jagannath), ఛార్మీ కౌర్(Charmee Kaur) నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది.








