దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. షెడ్యూల్ ప్రకారమే కీలక స్టేట్మెంట్
కన్నడ నటుడు దర్శన్(darshan)కు సంబంధించిన రేణుకాస్వామి(renuka swamy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న ప్రదోష్ స్టేట్మెంట్ను వాయిదా వేయాలంటూ దర్శన్ తరఫు లాయర్లు చేసిన విజ్ఞప్తిని బెంగళూరు కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో సెప్టెంబర్ 28న ప్రదోష్(pradosh) వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ కొనసాగనుంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కొంత టైమ్ అవసరమని, సర్టిఫైడ్ కాపీ లేట్ గా అందిందని దర్శన్ తరఫు న్యాయవాదులు వారం రోజుల గడువు కోరారు. అయితే ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు వారి అభ్యర్థనను అంగీకరించలేదు.
ఈ కేసులో ప్రదోష్ గతంలో 14వ నిందితుడిగా ఉన్నారు. అనంతరం ప్రభుత్వ సాక్షిగా మారేందుకు అనుమతి పొందారు. కేసుకు సంబంధించిన తనకు తెలిసిన విషయాలను వెల్లడించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది. ప్రదోష్‌ను అప్రూవర్‌గా కొనసాగించడాన్ని కర్ణాటక హైకోర్టు ఇటీవల సమర్థించడంతో పాటు, విచారణ సమయంలో ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేసే రైట్ దర్శన్‌కు ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 28న నమోదయ్యే ప్రదోష్ స్టేట్మెంట్పై కేసులో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
2024 జూన్‌లో బెంగళూరులో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైన ఘటనకు సంబంధించి దర్శన్, పవిత్ర గౌడ(pavitra gowda) సహా పలువురిపై కేసు నమోదైంది. ఇప్పటికే కేసు విచారణ కీలక దశలో ఉండగా, ప్రదోష్ వాంగ్మూలం దర్యాప్తులోని పలు అంశాలను మరింత క్లారిటీ ఇచ్చే అవకాశముంది. మరోవైపు పవిత్ర గౌడ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించడంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు.








