వన్ నేమ్ తో జైలర్2 పై పెరుగుతున్న అంచనాలు
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్2(jailer2) నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై హైప్ పెరుగుతుండగా.. ఇప్పుడు మూడో సింగిల్‌గా వన్ నేమ్(One name) ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 29న ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో రిలీజ్ కు ముందు రజినీ ఫ్యాన్స్ లో మరోసారి సందడి మొదలైంది.
జైలర్ తో తనదైన స్టైల్లో మాస్ ఎంటర్టైనర్ను అందించిన నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar), సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన కంటెంట్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో వన్ నేమ్ పై సహజంగానే అంచనాలు పెరిగాయి.
ఇవి కూడా చదవండి
సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ(ramya krishna), విద్యాబాలన్(Vidya balan) , ఎస్.జె.సూర్య(SJ Surya), సూరజ్ వెంజారమూడు(Suraj venjaramudu), యోగిబాబు(Yogibabu) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతున్న జైలర్2 కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా క్రమంగా ఊపందుకుంటున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు వచ్చే వన్ నేమ్ సాంగ్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతుందేమో చూడాలి.








