తెలంగాణలో 92.88 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ 9Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా (voter list) ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నోటీసుల ప్రక్రియ కొనసాగుతోంది. 92,88,180 నోటీసులు జనరేట్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ( సీఈవో) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) వెల్లడించారు. 87,85,739 మందికి నోటీసులు ( Notices) జారీ చేసినట్లు తెలిపారు. 58,97,432 ఓటర్ల హియరింగ్ పూర్తయిందని, 45,54,236 ఓటర్లను తుది జాబితాకు అర్హులుగా నిర్థరించినట్లు వివరించారు.








