సీఈసీని తొలగించేంత వరకు రాహుల్ నాయకత్వంలో పోరాటం : మంత్రి ఉత్తమ్
కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం లేని వారి ఓట్లను తొలగిస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సీఈసీ ద్వారా ఓటరు జాబితాను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రల్లో ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వస్తోంది. తొలగించిన ఓట్లు చేర్చే అవకాశం లేకుండా కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో 30 శాతం ఓట్లు ప్రభావితం అవుతున్నాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ (CEC Gyanesh Kumar)ను తొలగించాలి. దేశంలో సీఈసీ, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. సీఈసీని తొలగించేంత వరకు రాహుల్ నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కుట్రలు చేసినా, రాహుల్ (Rahul) ప్రధాని ( Prime Minister) కావడం ఖాయం అని అన్నారు.








