కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఈటల రాజేందర్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress government) అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. పేదలు, రైతుల భూములను ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై అసెంబ్లీ, ప్రజాక్షేత్రంలో బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు, పోరాటల గురించి అమిత్ షాకు వివరించారు. దానం నాగేందర్ (Danam Nagender) పై అనర్హతతో ఖైరతాబాద్ (Khairatabad)లో రాబోయే ఉప ఎన్నికపైనా చర్చించారు.








