వైట్ డ్రెస్ లో సింపుల్ లుక్ తోనే అదరగొడుతున్న భాగ్యశ్రీ
టాలీవుడ్ అందాల తార భాగ్య శ్రీ బోర్సే(Bhagya sri borse) గురించి, తన అందం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది భాగ్యశ్రీ. అందులో భాగంగానే తాజాగా అమ్మడు సింపుల్ వైట్ మినీ డ్రెస్ లో ఎలాంటి హడావిడి లేకుండా నేచురల్ గ్లో తో మెరిసిపోతూ కనిపించింది. వైట్ హాల్టర్ నెక్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్‌లో భాగ్యశ్రీ గ్లామర్ టచ్‌తో కనిపించింది. సొగసైన హెయిర్ స్టైల్, మినిమల్ యాక్సెసరీస్‌తో లుక్‌ను చాలా ఎలిగెంట్‌గా తీర్చిదిద్దగా, ముఖ్యంగా కెమెరా వైపు చూస్తూ అమ్మడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఫొటోలను మరింత ఎట్రాక్టివ్ గా మార్చాయి. ఈ ఫోటోలను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నామంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.








