అసెంబ్లీ ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) ఘటనపై హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని ఆదేశించింది. సదరు పోలీసుల వివరాలను స్పీకర్ (Speaker)కు ఇవ్వాలని డీజీపీ (DGP)ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఘటన అసెంబ్లీ వద్ద జరిగినట్లయితే ఆ వివరాలను హైకోర్టుకు నివేదించాలని ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ (Assembly) నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.








