తెలంగాణలో నిలబడిన ది ప్యారడైజ్.. మిగతా చోట్ల నిరాశ
భారీ స్థాయిలో తెరకెక్కిన ది ప్యారడైజ్(the paradise) సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా(dasara) తర్వాత నాని(nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ యాక్షన్ డ్రామాకు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మౌత్ టాక్ ఆశించిన స్థాయిలో లేకపోయినా మొదటి రోజు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకోవడం సినిమాకు కలిసొచ్చింది. తెలంగాణలో మాత్రం ఆడియన్స్ ఆదరణ కొంతవరకు కొనసాగడంతో ఫస్ట్ వీకెండ్ లో సినిమా తన స్థాయిని నిలబెట్టుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా వచ్చిన ఎక్స్ట్రా హాలిడే అడ్వాంటేజ్ కూడా కలెక్షన్లకు ఉపయోగపడింది.
ఇక ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రీమియర్ల నుంచే వచ్చిన నెగెటివ్ టాక్ ఇంపాక్ట్ కలెక్షన్లపై స్పష్టంగా పడింది. తొలి రోజుతో పోలిస్తే తర్వాతి రోజుల్లో ఆంధ్ర ప్రాంతాల్లో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తెలంగాణ మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడిని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, మిగిలిన తెలుగు ప్రాంతాల్లో మాత్రం రికవరీ కష్టంగా మారుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా పెద్దగా పుంజుకోకపోవడం మరో మైనస్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఓవర్సీస్లో భారీ ఓపెనింగ్ దక్కినా మిక్డ్స్ రెస్పాన్స్ కారణంగా అక్కడి కలెక్షన్లలో నిలకడ కనిపించలేదు. భారీ బడ్జెట్, భారీ స్కేల్‌తో రూపొందించిన సినిమాకు లభించిన అవకాశాన్ని శ్రీకాంత్ ఓదెల పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారనే డిస్కషన్ మొదలైంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) ఈ ప్రాజెక్ట్‌పై భారీగా పెట్టుబడి పెట్టగా, అనిరుధ్(Anirudh) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కాయదు లోహర్(Kayadhu lohar) పాత్రపై వచ్చిన విమర్శలు కూడా సినిమాకు ప్రతికూలంగా మారాయి. మొత్తంగా తెలంగాణలో నిలబడుతున్నా, ఇతర మార్కెట్లలో ది ప్యారడైజ్ కు ఆశించిన ఫలితం దక్కే పరిస్థితి కనిపించడం లేదు.








