టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల (Tirumala)లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 5వ తేదీల్లో బ్రేక్ దర్శనాలు (Break Darshans) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1న (గురువారం), అక్టోబర్ 5న ( సోమవారం) ప్రొటోకాల్ (Protocol) ప్రముఖులకు మినహా వీఐపీ (VIP) బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది. తిరుమలలో పెరటాసి మాసం, రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.








