స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పాలి : మంత్రి కొల్లు రవీంద్ర
స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు రాకుండా వైసీపీ(YCP) చేస్తున్న కుట్రలను బీసీ(BC)లు తిప్పికొట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం రూ.35 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. గతంలో కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా జగన్ (Jagan) మోసగించారని విమర్శించారు. బీసీలను అణగదొక్కి రాజకీయంగా ఎదగాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన జగన్, ముమ్మాటీకీ బీసీ ద్రోహి అని మండిపడ్డారు. స్థానిక సంస్థల (Local body) ఎన్నికల్లో వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలు ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారి భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురానుందని తెలిపారు.








