వంద కోట్లపై కన్నేసిన మండాడి
తమిళ హీరో సూరి(Suri) కెరీర్లో మండాడి సినిమా కొత్త అధ్యాయాన్ని రాస్తోంది. మతిమారన్ పుగళంది (mathimaran pugalandi) దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని సూరి కెరీర్లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాకు కమర్షియల్‌గా మంచి రెస్పాన్స్ లభించింది. సుహాస్(Suhas) కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీ, కథా నేపథ్యం, నటీనటుల పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.
తమిళనాడు కలెక్షన్ల విషయానికి వస్తే మండాడి(Mandadi) ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. ఇదే జోరు కంటిన్యూ అయితే సొంత రాష్ట్రంలోనూ రూ.100 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా తమిళ బాక్సాఫీస్‌పై ఈ స్థాయి నంబర్లను ప్రధానంగా స్టార్ హీరోల సినిమాలు నమోదు చేస్తుంటాయి. అందుకే సూరి సినిమా ఈ స్థాయికి చేరువ కావడం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ సినిమా రూ.100 కోట్ల తమిళనాడు గ్రాస్‌ను కూడా దాటితే సూరి కెరీర్లో మరో అరుదైన రికార్డు నమోదవుతుంది. ప్రస్తుతం సినిమాకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఆ మార్క్‌పై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా దృష్టి సారించాయి. జి.వి. ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) మ్యూజిక్ అందించిన ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ (Elred kumar), వెట్రిమారన్(vetrimaran) నిర్మించారు. సత్యరాజ్(Satyaraj), మహిమా నంబియార్ (Mihama nimbiyar) తదితరులు కీలక పాత్రల్లో నటించారు.








