నాడు సైమన్ గో బ్యాక్.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్… సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో అస్సాం దినపత్రిక ప్రతిదిన్ కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్ట్స్ చాఫ్టర్ అంశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
* తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్రభావం పెద్దగా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రాజకీయాల శైలి వేరు… మా దగ్గర యూనివర్సిటీ లా కాలేజ్, ఆర్ట్స్ కాలేజీ నాయకునిగా ఏబీవీపీలో గెలిచిన వారు తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజకీయాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటే.. రాజకీయాల్లోకాంగ్రెస్ ప్రభావం ఉంటుంది..
* నేను 2006లో జడ్పీటీసీ సభ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్కడ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్దగా సంబంధాలు పెద్దగా లేవు.. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా.. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను. 2019లో ఎంపీగా గెలిచాను…
* రాష్ట్ర విభజన తర్వాత నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉండడంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రాధాన్యం తగ్గిపోయింది. మీరు మంచి నాయకుడు, మీరు నాయుడుతో కలిసి పని చేస్తే తెలంగాణలో ఇబ్బంది అని ప్రజలు చెప్పారు.. దాంతో నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏతో ఉంది. ఏపీలో ఎన్డీఏ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. నేను రెండింటితో పోరాడాల్సి ఉంది.. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ తో పాటు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారు… రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత పోటీ కేసీఆర్, రేవంత్ మధ్య పోటీగా మారింది. ఆయన నన్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి కన్నా జైలుకే ఎక్కువ సార్లు పోయా… రాహుల్ గాంధీని కలిసిన తర్వాత 15 నిమిషాలు మాట్లాడాం.. ఆ రోజే ఆయన నా నాయకుడి అని నిర్ణయించుకున్నా… రాహుల్ గాంధీకి ఎటువంటి వ్యక్తిగత అజెండాలు లేవు.. ఆయనకు దేశమే ముఖ్యం.. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా.. నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనుకున్నా…
* యాంకర్: కాంగ్రెస్ నుంచి అనేక మంది బీజేపీలో చేరుతున్న సమయంలో మీరు కాంగ్రెస్‌లో ఎలా చేరారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: విద్యార్ఙి సంఘంలో పని చేశావు.. బీజేపీలో చేరితే గొప్ప నాయకుడివి అవుతావు.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇతరులతో పాటు కేసీఆర్ తో చేరితే మంత్రి అవుతావని చాలా మంది చెప్పారు. కానీ 70 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్లనే మేం తెలంగాణ సాధించుకున్నాం. పెద్దదయిన ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. 175 శాసనసభ, 25 పార్లమెంట్ స్థానాలున్నా రాష్ట్రాన్ని ఆమె త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం లేదు… 1200 మంది యువకుల ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజల ఆకాంక్షలను, ఆందోళలను గౌరవించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో అక్కడి నాయకులు కృత్రిమ ఉద్యమం తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఆమె తెలంగాణ ఇచ్చారు. ప్రజల ఆత్మగౌరవం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆమె ఏ లక్ష్యాలతో తెలంగాణ ఇచ్చారో వాటన్నింటిని కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. అందుకే నేను కాంగ్రెస్‌లో చేరాను. కేసీఆర్ ను ఓడించాను. తెలంగాణలో కాంగ్రెస్‌కు చోటు లేదని కొందరు అన్నా నేను కాంగ్రెస్‌లో చేరాను. నేను బయటి నుంచి వచ్చిన వ్యక్తిని అయినా అయిదేళ్లలోనే కార్యనిర్వాహక అధ్యక్షుడిని, ఎంపీని, పీసీసీ అధ్యక్షుడిని అయ్యాను. ముఖ్యమంత్రిని అయ్యాను. ఆ అవకాశాలన్నింటిని కాంగ్రెస్ నాకు ఇచ్చింది.
* మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అక్షరాస్యత 12.50 శాతం కూడా లేదు. పేదరికం, కరవు ఉన్నాయి. అందుకే పండిట్ నెహ్రూ గారు విద్య, సాగు నీటి రంగానికి పెద్ద పీట వేశారు. అందుకే ఐఐఎంలు, ఐఐటీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. భాక్రాంనంగల్ మొదలు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీతో పాటు దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నిర్మించారు. చిన్న చిన్న గ్రామాలు, ఆదివాసీ గూడేల్లోనూ పాఠశాలలు తెరిచారు. తెలంగాణలో 27 వేల పాఠశాలలున్నాయి. 1,25,000 మంది ఉపాధ్యాయులున్నారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించేందుకు ప్రయత్నం చేశారు. తర్వాత ఆరోగ్య రంగంపై దృష్టిసారించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన సగటు ఆయుర్దాయం 33 ఏళ్లు.. ఇప్పుడు 73 ఏళ్లు.. విద్యా, వైద్యం, సాగు అన్నింటికి నెహ్రూ గారు పునాది వేశారు. అక్కడి నుంచి క్రమంగా మనం అభివృద్ధి చెందాం.. అయితే ఇప్పుడు చదువు ఉన్నా అందులో నాణ్యత లేదు. ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నా పౌష్టికాహారం లభించడం లేదు..మనం ఇప్పుడు మరో పెద్ద ముందడుగు వేయాలి.. విద్యా విధానానికి సంబంధించి తెలంగాణలో మీరు చూడండి. రెవెన్యూ, ఆర్థిక శాఖలపై చర్చ వచ్చినా నేను వాటిని తీసుకోలేదు. విద్యా శాఖను తీసుకున్నా… భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో 25 లక్షల ఎకరాలను దళిత, ఆదివాసీ, వెనుకబడిన పేద కుటుంబాలకు పంచారు…ఇప్పుడు పంచడానికి తెలంగాణలో భూములు లేవు… సంక్షేమానికి ఎటువంటి వనరులు లేవు.. చదువుకున్నందునే అంబేడ్కర్, మన్మోహన్సింగ్, అబ్దుల్ కలాం గొప్పవాళ్లయ్యారు. చదువుకున్న వాళ్లే ప్రపంచంలో ఎదగగలిగారు. అందుకే మా రాష్ట్రంలో యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించాలని నిర్ణయించా. ప్రభుత్వ విద్యలో లోపాలను గుర్తించా. దేశంలో సగటున 30 మంది విద్యార్థులకు 1 టీచర్ ఉంటే, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు.. మేం దేశ సగటు కన్నా మిన్నగా ఉన్నాం. అయినా ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 నుంచి 60 వేల మంది పక్కకు వెళుతున్నారు.. ఏటా టీచర్లను నియమిస్తున్నాం. ఈ అంశంపై పరిశీలనకు విద్యా కమిషన్ ను నియమించా.. ఒక రిటైర్ ఐఏఎస్ అధికారి, ఒక యూనివర్సిటీ విద్యార్థి, ఇతర ప్రముఖులు అందులో సభ్యులు. వారి విదేశాల్లో అధ్యయనం చేశారు. గ్రామాలకు వెళ్లారు. ఎందుకు మీరు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడం లేదని తల్లిదండ్రులను అడిగితే ఇంగ్లీష్ మీడియం లేదు, మీరు తెలుగు మీడియం చెబుతున్నారు.. మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు.. ప్రైవేటులో నర్సరీ ఉంటుంది.. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇది ఉండదు. మేం పదో తరగతి తర్వాత చదివే విద్యార్థులకు మేం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఇస్తున్నాం…కానీ ప్రైవేటు కాలేజీల్లో నాణ్యత ఉండడం లేదు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉండరు…
* సంక్షేమానికి సంబంధించి పోటీ నడుస్తున్నప్పుడు పోటీ పడకతప్పదు.. ఎదుటి వాళ్లు ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు, హాకీ ఆడుతున్నప్పుడు నేను కాలును, హాకీ స్టిక్‌ను ఉపయోగించకతప్పదు. చేతులు ఉపయోగిస్తే గోల్ చేయలేను. గెలవలేను. సంక్షేమ, ఉచిత పథకాలపై రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. మేం ఇచ్చిన హామీలు అమలు చేశాం. కానీ, బీజేపీ పెద్దలు సంక్షేమం, గ్యారంటీలు వద్దు అంటారు.. కానీ మోదీ పేరు అంటేనే సంక్షేమం గ్యారంటీ అంటున్నారు. మరి వారు చేసేది ఏంటీ? ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తాంటే, అప్పుడు ప్రణాళిక సక్రమంగా ఉంటుంది. వేతనాలు, పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ, సంక్షేమ పథకాల మీద ఖర్చు తప్పనిసరి. దాంతో అభివృద్ధికి పైసలు ఎక్కడ ఉన్నాయి. అందుకే మా రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేమని పలుమార్లు స్పష్టంగా చెబుతున్నా.
మేం విద్యా విధానాన్ని గాడిన పెడుతున్నాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి 12వ తరగతి వరకు భాష, నైపుణ్యాలు నేర్పుతున్నాం. ఇంగ్లీష్ అనుసంధాన భాష. ఉద్యోగాలు కల్పించే భాష, గ్రామాల్లో పిల్లలు మంచి చురుకైన వారు… కానీ తమ భావాలను వ్యక్తీకరించలేక ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అందుకే 12వ తరగతిలోపు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతున్నాం. 12వ తరగతి తర్వాత నైపుణ్యాలు నేర్పుతున్నాం…మా రాష్ట్రం నుంచి ఏటా దాదాపు 1.80 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అందులో కేవలం 20 వేల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లు వాళ్ల చదువు, స్థాయికి తగని ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టాం. సర్టిఫికెట్ల కోసం చదువు వద్దు.. నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నా.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర ఛైర్పర్సన్, శ్రీని రాజు వైస్ ఛైర్పర్సన్. మిగతా కార్పొరేట్ కంపెనీల అధిపతులు డైరెక్టర్లు.. ఉద్యోగాలు కల్పించే నైపుణ్యాలకు సంబంధించిన కోర్సుల రూపకల్పన వారి బాధ్యత. దాంతో వంద శాతం ఉద్యోగాలు వస్తున్నాయి..
1956లో దేశంలో ఐటీఐలు ప్రారంభించారు. వాటిలో డీజిల్ మెకానిక్ వంటి కోర్సులు ఉంది. 70 ఏళ్ల తర్వాత ఆ కోర్సే ఉంది. ఇప్పుడు అంబాసిడర్ కారు లేదు. డీజిల్ మెకానిక్ లేడు. ఎక్కడా చూద్దామన్నా అంబాసిడర్ కారు లేదు. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఒక్క అంబాసిడర్ కారు ఉంది. వాళ్ల పార్టీ గుర్తు. మరో కారే లేదు. నేను ఆ కోర్సులు తీసివేశాం. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. 86 శాతం టాటా కంపెనీ నిధులు ఇస్తోంది. మేం 14 శాతం భరిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీలు ఏర్పాటు చేశాం. సిలబస్ వాళ్లే తయారు చేస్తున్నారు. వాళ్లే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏఐతో వైట్ కాలర్ జాబ్లకు కాలం చెల్లింది. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్‌ల కాలం. అవి జర్మనీ, జపాన్, కొరియా దేశాలు ఇస్తున్నాయి. అక్కడ ఉద్యోగాలు చేసేందుకు వీలుగా జర్మన్, జపాన్, కొరియా భాషలు నేర్పిస్తున్నాం. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం…
* గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన హుందాతనంతో వ్యవహరించి గుజరాత్ అభివృద్ధి చాలా సహకరించారు. మన్మోహన్ సింగ్ మోదీకి ఇచ్చిన మద్దతులో 10 శాతం కూడా ఆయన మాకు మద్దతు ఇవ్వడం లేదు. మన్మోహన్సింగ్ గుజరాత్‌కు అవసరమైనవన్నీ ఇచ్చారు. మేం కలిసినప్పుడు మోదీ మంచిగానే ఉంటారు. కానీ మా రాష్ట్రానికి మెట్రో రైలు, రీజినల్ రింగు రోడ్డు, జాతీయ రహదారుల విస్తరణకు ఏమాత్రం సహకరించడం లేదు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలిచాం. రెండేళ్లవుతున్నా పీఎం కార్యాలయంలో ఉంచుకున్నారు. మేం నితిన్ గడ్కరీని ఎప్పుడూ అడిగినా… నా చేతిలో ఏమీ లేదు, మోదీ దగ్గర ఫైల్ ఉందంటాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు ఉన్న అవకాశాలను ప్రోత్సహించాలి. గుజరాత్లో పోర్ట్ ఉంది. వాళ్లకు ఉన్న అవకాశం అంది. మా దగ్గర ఎయిర్పోర్ట్, జ్ఞానవంతులు ఉన్నారు.. సత్య నాదెళ్ల, శంతను నారాయణన్, అజయ్ బంగా, ప్రేమ్ శ్రీవాత్సవ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నాకు ఐఎస్బీ, ఐఐటీ, నల్సార్ ఉన్నాయి. ఎక్కడో నిపుణులుంటారో అక్కడకు కంపెనీలు వస్తాయి. సెమీ కండక్టర్ ప్రాజెక్టును చివరి నిమిషంలో గుజరాత్ తీసుకెళ్లారు.
* ఇది ఉత్తరాది దక్షిణాది అంశం కాదు.. గుజరాత్, మిగతా దేశం వ్యవహారంలా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలకు తేడా ఉంది. మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా గుజరాత్‌కే అన్నీ తీసుకెళుతున్నారు. బెదిరించి తీసుకెళుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు ఎన్ని కంపెనీలు తీసుకెళ్లారు.. గుజరాత్‌కు ఎన్ని తీసుకెళ్లారు. మీరు మోదీని ఎదురుగా కూర్చొబెడితే అడుగుతా (యాంకర్ ప్రశ్నకు బదులుగా)
* నియోజకవర్గాల పునర్విభజన సమస్య ఏమిటంటే రాజకీయాలు అంకెల ఆట… సమ ఉజ్జీల మధ్య సంప్రదింపులు సాగుతాయి.. బలవంతులు, బలహీనుల మధ్య కాదు…రాజకీయాల్లో మీ దగ్గర సంఖ్యా బలం ఉంటేనే ఢిల్లీ పిలిచి మాట్లాడుతుంది. లేకపోతే గేటు దగ్గరకు రానివ్వరు.. అందుకే నేను సాధారణమైన పరిష్కారం చూపుతున్నా… 1976లో ఇందిరా గాంధీ గారు 543 సీట్లకు లోక్‌సభ స్థానాలను ఫ్రీజ్ చేశారు. కేంద్రం కుటుంబ నియంత్రణ పిలుపునిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయి. ఉత్తరాదిలో అది జరగలేదు. దీంతో జనాభాలో హెచ్చుతగ్గులు పెరిగాయి. అందుకే ఇందిరా గాంధీ గారు 25 ఏళ్లు ఆ సంఖ్యను ఫ్రీజ్ చేశారు. తర్వాత వచ్చిన వాజ్‌పేయీ జీ మరో 25 ఏళ్లు దాన్ని పొడిగించారు. 2026లో మోదీ అలానే మరో 25 ఏళ్లు పొడిగిస్తే ఎవరికీ ఇబ్బంది రాదు. కానీ, మోదీజీ … డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల పేరుతో పెద్ద రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం పెంచుతూ, చిన్న రాష్ట్రాలను ఖతం చేయాలని చూస్తున్నారు. కేరళలో ప్రస్తుతం 20 లోక్‌సభ సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య 60 సీట్లు తేడా ఉన్నాయి. 50 శాతం పెంచితే కేరళలో 30, ఉత్తరప్రదేశ్‌లో 120 సీట్లు అవుతాయి. అప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య సీట్ల తేడా 90 అవుతుంది. ఒక్క నెంబర్‌తో అటల్ జీ ప్రభుత్వం పడిపోయింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, బీమారు రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. మా దగ్గర నెంబర్లు లేనప్పుడు మాకు ఏం ప్రాధాన్యత ఉంటుంది. ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దక్షిణాదికి దక్షిణాదికి రాష్ట్రపతి ఇచ్చేవారు. ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు రక్షణ, ఆర్థిక, హోం దక్షిణాదికి ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు మేం ఎక్కడా కనిపించడం లేదు. ప్రధానమంత్రి, హోం శాఖ, రక్షణ శాఖ, వాణిజ్య శాఖ మంత్రి, అన్ని ముఖ్యమైన పదవులు ఉత్తరాదికి ఉన్నాయి.. ఎందుకంటే దక్షిణాది సీట్లు మీకు అవసరం లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ ఇస్తే, మరొకటి అక్కడ ఇచ్చేవారు.
(యాంకర్: పౌరవిమానయాన శాఖ ఇచ్చారు కదా…) అందులో ఏముంది? ఆ శాఖ మొత్తం ప్రైవేటీకరణ అయింది. పోస్టల్ డిపార్ట్ మెంట్లా అయింది. ఫోన్ వచ్చాక మెసెజ్, టెక్ట్స్ అన్ని వస్తున్నాయి. పోస్టల్‌తో పని ఏముంది. వాట్సాప్, టెలిగ్రామ్ అన్ని ఉన్నాయి. గతంలో టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్ ఉంటే గొప్ప.. ఇప్పడు జేబుకో ఫోన్ ఉంటుంది. ఇప్పుడు అది అనవసరం.. ఇప్పుడు హోం ఇంపార్టెన్స్. హోంశాఖ కిందకే సీబీఐ, ఈడీ వస్తాయి కదా. అవి ఎందుకు ఇవ్వలేదు? రక్షణ ఎందుకు ఇవ్వలేదు.
నాడు సైమన్ గో బ్యాక్.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్…
ఢిల్లీ: సైమన్ గ్యోబాక్ నినాదం కింద నాడు దేశం ఏకమైనట్లు, రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్ నినాదం కింద దేశం ఏకమవుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో అస్సాం దిన పత్రిక ప్రతిదిన్ కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్ట్స్ చాఫ్టర్ అంశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లో….
* సైమన్ గోబ్యాక్ ఉద్యమం గుర్తుంది కదా..? 1919లో భారత ప్రభుత్వ చట్టం అమలు, దేశంలో పాలనా నిబంధనలు సమీక్షకు 1928లో సైమన్ కమిషన్ ను నియమించారు. అందులో ఏడుగురికి ఏడుగురు బ్రిటిషర్లు ఉంటే మాకు ఏం న్యాయం ఏం జరగుతుందని లాలా లజపతి రాయ్ ఉద్యమం లేవదీశారు. సైమన్ గో బ్యాక్ నినాదాన్ని ఇచ్చారు.
దేశమంతా ఏకమైంది. ఆందోళనలపై లాఠీఛార్జీ చేశారు. అందులో లాలాలజపతి రాయ్ చనిపోయారు. అప్పడు భగత్ సింగ్ జెండా ఎత్తారు. 1929 తర్వాత వందేళ్ల అనంతరం మోదీజీ ఎన్నికల కమిషన్‌ను సైమన్ కమిషన్ మాదిరే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ జనతా పార్టీ అవే ఎత్తుగడలు వేస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ సభలో చర్చించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు. గతంలో రాజులు రాజ్యాలు పాలించారు. రాజులు నిర్ణయించే వారు ఎవరు పాలించాలో..? దేశంలో ప్రజలే పాలకులను నిర్ణయిస్తున్నారు.. నాడు పాకిస్థాన్ నుంచి కొంత మంది వచ్చారు. జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాల నుంచి వచ్చారు. దాంతో నాడు వివరాలు అడిగారు. నాడు ఓటు హక్కు ఇచ్చేందుకు తాత ఎవరు, తండ్రి ఎవరనే వివరాలు అడిగారు. ఓ రికార్డు కోసం నాడు చేశారు. తర్వాత అనేకసార్లు శీఋ ప్రక్రియ జరిగింది. ప్రతిసారి ఓటు హక్కు ఇచ్చేందుకు దాన్ని చేపట్టారు. ఈసారి ఓటు హక్కు తొలగించేందుకు చేస్తున్నారు…
* 2014లో మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నాడు 81 కోట్ల ఓట్లు, 2019లో మోదీ ప్రధానమంత్రి అయ్యారు. 91 కోట్ల ఓట్లు, 2024లో 97 కోట్ల ఓట్లు.. 2029 ఎన్నికలకు సంబంధించి 13 కోట్ల ఓట్లు తొలగించారు. దేశంలో జనాభా పెరిగితే ఓట్లు పెరుగుతాయి. నాడు దేశంలో 35 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు 140 కోట్ల జనాభా. ఏటా జనాభా పెరుగుతోంది. మన ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించుకున్నాం. ఎందుకు ప్రధానమంత్రి మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కోట్ల ఓట్లు తొలగిస్తారు. దాని అర్ధం ఏమిటి?
* ప్రజల సగటు ఆయుర్ధాయం పెరిగింది. ఓట్లు పెరుగుతాయి. గతంలో ఓట్లు పెరిగిన తీరు చూడండి. ఇప్పుడు 30 కోట్ల ఓట్లు తొలగించాని మోదీ చూస్తున్నారు. తనను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ల ఓట్లు తొలగిస్తారు. వాళ్లకు ఉన్న ఆయుధం వాట్సాప్, సోషల్ మీడియా. ఎవరైతే వాళ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారో, వాళ్ల మతం, కులం ఏవీ పట్టించుకోకుండా ఓట్లు తొలగిస్తారు. మోదీజీకి అనుకూలంగా ఉన్నవారికి ఓటు హక్కు ఉంటుంది.
* గతంలో బూత్ లెవల్ అధికారం బూత్ లెవల్ అధికారికి, కలెక్టర్ అధికారం కలెక్టర్‌కి ఉండేది. ఇప్పుడు బూత్ లెవల్ అధికారి నుంచి ఎన్నికల కమిషన్ వరకు అన్ని అధికారాలు ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకున్నారు. నా గ్రామంలో ఎవరు ఉన్నారో, ఎవరు చనిపోయారో, ఎవరు ఊరు వదిలారో నాకు తెలుసు..
* ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడి ఓట్లు తీసివేస్తున్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కమిషనర్లకు తెలియకుండా జ్ఞానేష్ కుమార్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన భారత రాజ్యాంగ నేతలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలను అభిలాషించారు. కానీ, ప్రధాని మోదీ…. .ఎన్నికల సంఘం పేరుతో పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు.. దేశ ప్రజాస్వామిక సమస్య..
యాంకర్ః గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అని చెప్పారు కదా?
* నార్త్ కొరియాలో కిమ్‌దే పార్టీ. ఆయనకే ఓటు వేయాలి. ఒకటే టీవీ ఆయననే చూపించాలి. జ్ఞానేష్ కుమార్‌ను పది రోజులు నార్త్ కొరియా పంపిస్తే, కిమ్ దగ్గర శిక్షణ తీసుకొని వచ్చి మోదీకి వందకు వంద శాతం ఓట్లు వేయిస్తారు..
* సైమన్ గ్యోబాక్ నినాదం కింద నాడు దేశం ఏకమైనట్లు, రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్ నినాదం కింద దేశం ఏకమవుతుంది. అది మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్ ఎవరైనా కావచ్చు. అంతా ఒకటవుతారు..
* తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్రభావం పెద్దగా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రాజకీయాల శైలి వేరు… మా దగ్గర యూనివర్సిటీ లా కాలేజ్, ఆర్ట్స్ కాలేజీ నాయకునిగా ఏబీవీపీలో గెలిచిన వారు తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజకీయాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటే.. రాజకీయాల్లోకాంగ్రెస్ ప్రభావం ఉంటుంది..
* నేను 2006లో జడ్పీటీసీ సభ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్కడ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్దగా సంబంధాలు పెద్దగా లేవు.. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా.. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను. 2019లో ఎంపీగా గెలిచాను…
* రాష్ట్ర విభజన తర్వాత నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉండడంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రాధాన్యం తగ్గిపోయింది. మీరు మంచి నాయకుడు, మీరు నాయుడుతో కలిసి పని చేస్తే తెలంగాణలో ఇబ్బంది అని ప్రజలు చెప్పారు.. దాంతో నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏతో ఉంది. ఏపీలో ఎన్డీఏ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. నేను రెండింటితో పోరాడాల్సి ఉంది.. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ తో పాటు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారు… రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత పోటీ కేసీఆర్, రేవంత్ మధ్య పోటీగా మారింది. ఆయన నన్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి కన్నా జైలుకే ఎక్కువ సార్లు పోయా… రాహుల్ గాంధీని కలిసిన తర్వాత 15 నిమిషాలు మాట్లాడాం.. ఆ రోజే ఆయన నా నాయకుడి అని నిర్ణయించుకున్నా… రాహుల్ గాంధీకి ఎటువంటి వ్యక్తిగత అజెండాలు లేవు.. ఆయనకు దేశమే ముఖ్యం.. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా.. నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనుకున్నా…
* మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అక్షరాస్యత 12.50 శాతం కూడా లేదు. పేదరికం, కరవు ఉన్నాయి. అందుకే పండిట్ నెహ్రూ గారు విద్య, సాగు నీటి రంగానికి పెద్ద పీట వేశారు. అందుకే ఐఐఎంలు, ఐఐటీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. భాక్రాంనంగల్ మొదలు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీతో పాటు దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నిర్మించారు. చిన్న చిన్న గ్రామాలు, ఆదివాసీ గూడేల్లోనూ పాఠశాలలు తెరిచారు. తెలంగాణలో 27 వేల పాఠశాలలున్నాయి. 1,25,000 మంది ఉపాధ్యాయులున్నారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించేందుకు ప్రయత్నం చేశారు. తర్వాత ఆరోగ్య రంగంపై దృష్టిసారించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన సగటు ఆయుర్దాయం 33 ఏళ్లు.. ఇప్పుడు 73 ఏళ్లు.. విద్యా, వైద్యం, సాగు అన్నింటికి నెహ్రూ గారు పునాది వేశారు. అక్కడి నుంచి క్రమంగా మనం అభివృద్ధి చెందాం.. అయితే ఇప్పుడు చదువు ఉన్నా అందులో నాణ్యత లేదు. ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నా పౌష్టికాహారం లభించడం లేదు..మనం ఇప్పుడు మరో పెద్ద ముందడుగు వేయాలి.. విద్యా విధానానికి సంబంధించి తెలంగాణలో మీరు చూడండి. రెవెన్యూ, ఆర్థిక శాఖలపై చర్చ వచ్చినా నేను వాటిని తీసుకోలేదు. విద్యా శాఖను తీసుకున్నా… భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో 25 లక్షల ఎకరాలను దళిత, ఆదివాసీ, వెనుకబడిన పేద కుటుంబాలకు పంచారు…ఇప్పుడు పంచడానికి తెలంగాణలో భూములు లేవు… సంక్షేమానికి ఎటువంటి వనరులు లేవు.. చదువుకున్నందునే అంబేడ్కర్, మన్మోహన్సింగ్, అబ్దుల్ కలాం గొప్పవాళ్లయ్యారు. చదువుకున్న వాళ్లే ప్రపంచంలో ఎదగగలిగారు. అందుకే మా రాష్ట్రంలో యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించాలని నిర్ణయించా. ప్రభుత్వ విద్యలో లోపాలను గుర్తించా. దేశంలో సగటున 30 మంది విద్యార్థులకు 1 టీచర్ ఉంటే, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు.. మేం దేశ సగటు కన్నా మిన్నగా ఉన్నాం. అయినా ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 నుంచి 60 వేల మంది పక్కకు వెళుతున్నారు.. ఏటా టీచర్లను నియమిస్తున్నాం. ఈ అంశంపై పరిశీలనకు విద్యా కమిషన్ ను నియమించా.. ఒక రిటైర్ ఐఏఎస్ అధికారి, ఒక యూనివర్సిటీ విద్యార్థి, ఇతర ప్రముఖులు అందులో సభ్యులు. వారి విదేశాల్లో అధ్యయనం చేశారు. గ్రామాలకు వెళ్లారు. ఎందుకు మీరు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడం లేదని తల్లిదండ్రులను అడిగితే ఇంగ్లీష్ మీడియం లేదు, మీరు తెలుగు మీడియం చెబుతున్నారు.. మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు.. ప్రైవేటులో నర్సరీ ఉంటుంది.. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇది ఉండదు. మేం పదో తరగతి తర్వాత చదివే విద్యార్థులకు మేం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఇస్తున్నాం…కానీ ప్రైవేటు కాలేజీల్లో నాణ్యత ఉండడం లేదు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉండరు…
* సంక్షేమానికి సంబంధించి పోటీ నడుస్తున్నప్పుడు పోటీ పడకతప్పదు.. ఎదుటి వాళ్లు ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు, హాకీ ఆడుతున్నప్పుడు నేను కాలును, హాకీ స్టిక్‌ను ఉపయోగించకతప్పదు. చేతులు ఉపయోగిస్తే గోల్ చేయలేను. గెలవలేను. సంక్షేమ, ఉచిత పథకాలపై రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. మేం ఇచ్చిన హామీలు అమలు చేశాం. కానీ, బీజేపీ పెద్దలు సంక్షేమం, గ్యారంటీలు వద్దు అంటారు.. కానీ మోదీ పేరు అంటేనే సంక్షేమం గ్యారంటీ అంటున్నారు. మరి వారు చేసేది ఏంటీ? ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తాంటే, అప్పుడు ప్రణాళిక సక్రమంగా ఉంటుంది. వేతనాలు, పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ, సంక్షేమ పథకాల మీద ఖర్చు తప్పనిసరి. దాంతో అభివృద్ధికి పైసలు ఎక్కడ ఉన్నాయి. అందుకే మా రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేమని పలుమార్లు స్పష్టంగా చెబుతున్నా.
మేం విద్యా విధానాన్ని గాడిన పెడుతున్నాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి 12వ తరగతి వరకు భాష, నైపుణ్యాలు నేర్పుతున్నాం. ఇంగ్లీష్ అనుసంధాన భాష. ఉద్యోగాలు కల్పించే భాష, గ్రామాల్లో పిల్లలు మంచి చురుకైన వారు… కానీ తమ భావాలను వ్యక్తీకరించలేక ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అందుకే 12వ తరగతిలోపు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతున్నాం. 12వ తరగతి తర్వాత నైపుణ్యాలు నేర్పుతున్నాం…మా రాష్ట్రం నుంచి ఏటా దాదాపు 1.80 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అందులో కేవలం 20 వేల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లు వాళ్ల చదువు, స్థాయికి తగని ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టాం. సర్టిఫికెట్ల కోసం చదువు వద్దు.. నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నా.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర ఛైర్పర్సన్, శ్రీని రాజు వైస్ ఛైర్పర్సన్. మిగతా కార్పొరేట్ కంపెనీల అధిపతులు డైరెక్టర్లు.. ఉద్యోగాలు కల్పించే నైపుణ్యాలకు సంబంధించిన కోర్సుల రూపకల్పన వారి బాధ్యత. దాంతో వంద శాతం ఉద్యోగాలు వస్తున్నాయి..
1956లో దేశంలో ఐటీఐలు ప్రారంభించారు. వాటిలో డీజిల్ మెకానిక్ వంటి కోర్సులు ఉంది. 70 ఏళ్ల తర్వాత ఆ కోర్సే ఉంది. ఇప్పుడు అంబాసిడర్ కారు లేదు. డీజిల్ మెకానిక్ లేడు. ఎక్కడా చూద్దామన్నా అంబాసిడర్ కారు లేదు. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఒక్క అంబాసిడర్ కారు ఉంది. వాళ్ల పార్టీ గుర్తు. మరో కారే లేదు. నేను ఆ కోర్సులు తీసివేశాం. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. 86 శాతం టాటా కంపెనీ నిధులు ఇస్తోంది. మేం 14 శాతం భరిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీలు ఏర్పాటు చేశాం. సిలబస్ వాళ్లే తయారు చేస్తున్నారు. వాళ్లే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏఐతో వైట్ కాలర్ జాబ్లకు కాలం చెల్లింది. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్‌ల కాలం. అవి జర్మనీ, జపాన్, కొరియా దేశాలు ఇస్తున్నాయి. అక్కడ ఉద్యోగాలు చేసేందుకు వీలుగా జర్మన్, జపాన్, కొరియా భాషలు నేర్పిస్తున్నాం. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం…
* గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన హుందాతనంతో వ్యవహరించి గుజరాత్ అభివృద్ధి చాలా సహకరించారు. మన్మోహన్ సింగ్ మోదీకి ఇచ్చిన మద్దతులో 10 శాతం కూడా ఆయన మాకు మద్దతు ఇవ్వడం లేదు. మన్మోహన్సింగ్ గుజరాత్‌కు అవసరమైనవన్నీ ఇచ్చారు. మేం కలిసినప్పుడు మోదీ మంచిగానే ఉంటారు. కానీ మా రాష్ట్రానికి మెట్రో రైలు, రీజినల్ రింగు రోడ్డు, జాతీయ రహదారుల విస్తరణకు ఏమాత్రం సహకరించడం లేదు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలిచాం. రెండేళ్లవుతున్నా పీఎం కార్యాలయంలో ఉంచుకున్నారు. మేం నితిన్ గడ్కరీని ఎప్పుడూ అడిగినా… నా చేతిలో ఏమీ లేదు, మోదీ దగ్గర ఫైల్ ఉందంటాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు ఉన్న అవకాశాలను ప్రోత్సహించాలి. గుజరాత్లో పోర్ట్ ఉంది. వాళ్లకు ఉన్న అవకాశం అంది. మా దగ్గర ఎయిర్పోర్ట్, జ్ఞానవంతులు ఉన్నారు.. సత్య నాదెళ్ల, శంతను నారాయణన్, అజయ్ బంగా, ప్రేమ్ శ్రీవాత్సవ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నాకు ఐఎస్బీ, ఐఐటీ, నల్సార్ ఉన్నాయి. ఎక్కడో నిపుణులుంటారో అక్కడకు కంపెనీలు వస్తాయి. సెమీ కండక్టర్ ప్రాజెక్టును చివరి నిమిషంలో గుజరాత్ తీసుకెళ్లారు.
* ఇది ఉత్తరాది దక్షిణాది అంశం కాదు.. గుజరాత్, మిగతా దేశం వ్యవహారంలా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలకు తేడా ఉంది. మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా గుజరాత్‌కే అన్నీ తీసుకెళుతున్నారు. బెదిరించి తీసుకెళుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు ఎన్ని కంపెనీలు తీసుకెళ్లారు.. గుజరాత్‌కు ఎన్ని తీసుకెళ్లారు. మీరు మోదీని ఎదురుగా కూర్చొబెడితే అడుగుతా (యాంకర్ ప్రశ్నకు బదులుగా)
* మేం (దక్షిణాది) ద్రావిడులం. వాళ్లు (ఉత్తరాది) ఆర్యులు. మేం శివ భక్తులు… వాళ్లు, రామ భక్తులు. వాళ్లు రాముని సొమ్ము తిన్నారు. మోదీ ఎందుకు హరహర మహదేవ్ అని అనరు.. బీజేపీ నేతలు వేదికలపై జై శ్రీరాం అంటారు. హరహర మహదేవ్ ఎందుకు అనరు. జై శ్రీరాం అనే అంటారు. శివుడు పేదల దేవుడు. సంపన్నుల దేవుడు శ్రీరాముడు. బీజేపీ సంపన్నుల పార్టీ. తెలంగాణలో విద్యార్థిగా, నాయకునిగా అన్ని చూశాం.. ఆంధ్రలో 175 శాసనసభ సీట్లు ఉంటే, మా దగ్గర 119 స్థానాలున్నాయి. వాళ్లు ఎప్పుడూ మాపై పెత్తనం చేసేవారు..చూసీ చూసీ పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.. మైనారిటీలను అణిచివేస్తే ఇబ్బంది అవుతుంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమవుతుందో మీకు తెలుసు.. మీరు మనస్సులు గెలుచుకొని మూడు, నాలుగు సార్లు గెలవండి ఇబ్బంది లేదు.. ఇబ్బంది పెట్టవద్దు.. విప్లవం ఎక్కడి నుంచి వస్తుంది. అల్ప సంఖ్యాకులను అణిచివేస్తే విప్లవం వస్తుంది.
* 2004లో భారత దేశం వెలిగిపోతోంది అని వాజ్‌పేయీజీ అంటే ఏమైంది. అసలు ఈ దేశంలో కాంగ్రెస్ ఉంటుందా లేదా అనే చర్చ సాగింది. కానీ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఏం చేశారో చూశారు. ఈ దేశ ప్రజలు చాలా తెలివైన వారు. అందుకే మోదీ ఓటు హక్కును గుంజుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. శీఋ ఎందుకు?
ప్రజలు ఏం చేయనున్నారో ఆయనకు తెలుసు..
* సైమన్ గోబ్యాక్ ఉద్యమం గుర్తుంది కదా..? 1919లో భారత ప్రభుత్వ చట్టం అమలు, దేశంలో పాలనా నిబంధనలు సమీక్షకు 1928లో సైమన్ కమిషన్ ను నియమించారు. అందులో ఏడుగురికి ఏడుగురు బ్రిటిషర్లు ఉంటే మాకు ఏం న్యాయం ఏం జరగుతుందని లాలా లజపతి రాయ్ ఉద్యమం లేవదీశారు. సైమన్ గో బ్యాక్ నినాదాన్ని ఇచ్చారు.
దేశమంతా ఏకమైంది. ఆందోళనలపై లాఠీఛార్జీ చేశారు. అందులో లాలాలజపతి రాయ్ చనిపోయారు. అప్పడు భగత్ సింగ్ జెండా ఎత్తారు. 1929 తర్వాత వందేళ్ల అనంతరం మోదీజీ ఎన్నికల కమిషన్‌ను సైమన్ కమిషన్ మాదిరే
ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ జనతా పార్టీ అవే ఎత్తుగడలు వేస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ సభలో చర్చించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు. గతంలో రాజులు రాజ్యాలు పాలించారు. రాజులు నిర్ణయించే వారు ఎవరు పాలించాలో..? దేశంలో ప్రజలే పాలకులను నిర్ణయిస్తున్నారు.. నాడు పాకిస్థాన్ నుంచి కొంత మంది వచ్చారు. జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాల నుంచి వచ్చారు. దాంతో నాడు వివరాలు అడిగారు. నాడు ఓటు హక్కు ఇచ్చేందుకు తాత ఎవరు, తండ్రి ఎవరనే వివరాలు అడిగారు. ఓ రికార్డు కోసం నాడు చేశారు. తర్వాత అనేకసార్లు శీఋ ప్రక్రియ జరిగింది. ప్రతిసారి ఓటు హక్కు ఇచ్చేందుకు దాన్ని చేపట్టారు. ఈసారి ఓటు హక్కు తొలగించేందుకు చేస్తున్నారు…
* 2014లో మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నాడు 81 కోట్ల ఓట్లు, 2019లో మోదీ ప్రధానమంత్రి అయ్యారు. 91 కోట్ల ఓట్లు, 2024లో 97 కోట్ల ఓట్లు.. 2029 ఎన్నికలకు సంబంధించి 13 కోట్ల ఓట్లు తొలగించారు. దేశంలో జనాభా పెరిగితే ఓట్లు పెరుగుతాయి. నాడు దేశంలో 35 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు 140 కోట్ల జనాభా. ఏటా జనాభా పెరుగుతోంది. మన ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించుకున్నాం. ఎందుకు ప్రధానమంత్రి మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కోట్ల ఓట్లు తొలగిస్తారు. దాని అర్ధం ఏమిటి?
* ప్రజల సగటు ఆయుర్ధాయం పెరిగింది. ఓట్లు పెరుగుతాయి. గతంలో ఓట్లు పెరిగిన తీరు చూడండి. ఇప్పుడు 30 కోట్ల ఓట్లు తొలగించాని మోదీ చూస్తున్నారు. తనను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ల ఓట్లు తొలగిస్తారు. వాళ్లకు ఉన్న ఆయుధం వాట్సాప్, సోషల్ మీడియా. ఎవరైతే వాళ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారో, వాళ్ల మతం, కులం ఏవీ పట్టించుకోకుండా ఓట్లు తొలగిస్తారు. మోదీజీకి అనుకూలంగా ఉన్నవారికి ఓటు హక్కు ఉంటుంది.
* గతంలో బూత్ లెవల్ అధికారం బూత్ లెవల్ అధికారికి, కలెక్టర్ అధికారం కలెక్టర్‌కి ఉండేది. ఇప్పుడు బూత్ లెవల్ అధికారి నుంచి ఎన్నికల కమిషన్ వరకు అన్ని అధికారాలు ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకున్నారు. నా గ్రామంలో ఎవరు ఉన్నారో, ఎవరు చనిపోయారో, ఎవరు ఊరు వదిలారో నాకు తెలుసు..
* ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడి ఓట్లు తీసివేస్తున్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కమిషనర్లకు తెలియకుండా జ్ఞానేష్ కుమార్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన భారత రాజ్యాంగ నేతలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలను అభిలాషించారు. కానీ, ప్రధాని మోదీ…. .ఎన్నికల సంఘం పేరుతో పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు.. దేశ ప్రజాస్వామిక సమస్య..
యాంకర్ః గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ అని చెప్పారు కదా?
* నార్త్ కొరియాలో కిమ్‌దే పార్టీ. ఆయనకే ఓటు వేయాలి. ఒకటే టీవీ ఆయననే చూపించాలి. జ్ఞానేష్ కుమార్‌ను పది రోజులు నార్త్ కొరియా పంపిస్తే, కిమ్ దగ్గర శిక్షణ తీసుకొని వచ్చి మోదీకి వందకు వంద శాతం ఓట్లు వేయిస్తారు..
* సైమన్ గ్యోబాక్ నినాదం కింద నాడు దేశం ఏకమైంది.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్ నినాదం కింద ఏకమవుతుంది. అది మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్ ఎవరైనా కావచ్చు. అంతా ఒకటవుతారు..