దేవర2పై మళ్లీ మొదలైన డిస్కషన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కెరీర్లో స్పెషల్ గా నిలిచిన దేవర(Devara) రిలీజై రెండేళ్లు పూర్తైంది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్‌ను అందుకుంది. సినిమా రిలీజ్‌కు ముందే సెకండ్ పార్ట్ ను అనౌన్స్ చేయడంతో దేవర2(Devara2)పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సీక్వెల్ కథపై కొరటాల శివ వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమా ఫ్యూచర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే సీక్వెల్ ప్లాన్స్ కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు కొంతకాలం తెరపడింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్(dragon) షూటింగ్లో పాల్గొంటున్న ఆయన సినిమా 2027 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు త్రివిక్రమ్(trivikram) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న పౌరాణిక సినిమాకు కూడా ఎన్టీఆర్ కమిట్ అయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్టీఆర్ భారీగా డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. దీంతో వెంటనే దేవర2 కోసం టైమ్ కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక కొరటాల శివ కూడా బాలకృష్ణ(balakrishna)తో తెరకెక్కించనున్న NBK112పై దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమై 2027 సమ్మర్ టార్గెట్‌గా ముందుకు సాగనుంది. దీంతో దేవర2 ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో ప్రస్తుతం క్లారిటీ లేదు. NBK112 పూర్తయ్యే టైమ్ కు ఎన్టీఆర్ అందుబాటులోకి వస్తే కొరటాల సీక్వెల్‌ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. లేదంటే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ పూర్తిగా వేరే వైపు వెళ్లే పరిస్థితి రావచ్చు. మొత్తంగా దేవర2 ఫ్యూచర్‌పై ప్రస్తుతం అఫీషియల్ క్లారిటీ లేకపోయినా.. ప్రాజెక్ట్ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పే పరిస్థితి మాత్రం లేదు.








