డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగాస్టార్
సిల్వర్ స్క్రీన్‌పై దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) కోసం స్పెషల్ సెలబ్రిటీ టాక్ షోను నిర్వహించే అంశంపై డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీల్ దాదాపు ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే చిరంజీవి డిజిటల్ ఎంట్రీపై మరింత క్లారిటీ రానుంది. భారీ రెమ్యునరేషన్‌తో ఈ షోను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు సినిమాల ద్వారా ఆడియన్స్ ను అలరించిన చిరంజీవి.. టాక్ షో ఫార్మాట్లో ఎలా కనిపించబోతున్నారన్నది ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయనకు అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో స్పెషల్ డిస్కషన్ మొదలైంది. షో కాన్సెప్ట్, గెస్టులు, ఎపిసోడ్ల సంఖ్య వంటి వివరాలు అఫీషియల్ అనౌన్స్మెంట్ తోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు సినిమాల విషయంలోనూ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా(kaaka) షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. KVN ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వశిష్ఠ(vassishta) దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర(Vishwambhara) షూటింగ్ పూర్తైంది. యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ప్లానింగ్ త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.








