‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
బేబీ ఆరాధ్య& ఆదర్శ్ సమర్పణలో ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి, మహేంద్ర ఎస్ గైక్వాడ్ కో ప్రొడ్యూసర్ గా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న ఈ మూవీని రాజా నరేంద్ర తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోపీ మోహన్, దశరథ్, V సముద్ర, G రామ్ ప్రసాద్, డి ఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్,ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం..
నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ .. ‘రాజా నరేంద్ర గారు ‘రిచ్’ కథను చాలా రిచ్‌గా చెప్పారు. ఆ తర్వాత ఈ కథలోకి గోపీ గారు వచ్చారు. సాయి కార్తీక్ ఆ తర్వాత జాయిన్ అయ్యారు. మోహిత్, శ్రీజిత ఘోష్ యాడ్ చేశారు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగానే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామ’ని అన్నారు.
హీరో మోహిత్ పెడాడా మాట్లాడుతూ .. ‘మా ‘రిచ్’ లాంటి మంచి కథకు మంచి నిర్మాతలు దొరికారు. రాజా గారు అద్భుతంగా కథను రాసుకున్నారు. ఇంటర్వెల్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్‌కి గూస్ బంప్స్ వస్తుంది. యాక్టింగ్ చేస్తూ రాజా గారు కథను అద్భుతంగా నెరేట్ చేశారు. సాయి కార్తీక్ పాటలు అద్భుతంగా వచ్చాయి. సతీష్ రెడ్డి గారి కెమెరా వర్క్ మా సినిమాకి ప్లస్ అవుతుంది. ఈ మూవీ తర్వాత మేమంతా కూడా రిచ్ అవుతాం’ అని అన్నారు.
నిర్మాత మార్గం గోపి మాట్లాడుతూ .. ‘మా ‘రిచ్’ సినిమాని ఈ రోజు ప్రారంభించాం. పద్మనాభ రెడ్డి గారితో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాం. మా చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. మా సినిమాకి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు రాజా నరేంద్ర మాట్లాడుతూ .. ‘మా ‘రిచ్’ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నిర్మాతలకు థాంక్స్. ప్రస్తుత తరానికి నచ్చేలా బస్తీ బాయ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం. మాకు మీడియా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు
సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్ మాట్లాడుతూ .. ‘నాకు తెలుగు అంతగా రాదు. ‘రిచ్’ మూవీని హిందీలోనూ రిలీజ్ చేస్తాం. ముందు తెలుగులో ఈ మూవీని విడుదల చేసి.. అక్కడ డబ్ చేస్తాం. అందమైన ప్రేమ కథతో ఈ చిత్రం రాబోతోంది’ అని అన్నారు.
హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ .. ‘‘రిచ్’ సినిమాలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ఈ రోజు ఇలా మా మూవీ ప్రారంభోత్సవం జరగడం సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ‘రిచ్’ చిత్రం అందరినీ ఆకట్టుకోనుంది’ అని అన్నారు.
నటి పూజా కేంద్రే మాట్లాడుతూ .. ‘‘రిచ్’ చిత్రంలో నాకు మంచి రోల్ ఇచ్చారు. ఆద్యంత నవ్విస్తూనే ఉంటాను. మా సినిమాకి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.








