ఇరుముడి ఫుట్‌ఫాల్స్ లో రవితేజ సరికొత్త రికార్డు
మాస్ మహారాజా రవితేజ(raviteja) నటించిన ఇరుముడి థియేట్రికల్ జర్నీకి ముగింపు పలికింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.194 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గడంతో రూ.200 కోట్ల మార్క్‌కు చేరువలోనే రన్ ముగిసింది.
అయితే ఇరుముడి(Irumudi) అసలు స్పెషాలిటీ కలెక్షన్ల కంటే థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ సంఖ్యలో కనిపించింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సుమారు 1.45 కోట్ల టికెట్లను అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ధరలను భారీగా పెంచకుండా సాధారణ రేట్లతోనే రిలీజైన సినిమాకు ఈ స్థాయి ఫుట్‌ఫాల్స్ రావడం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అంశంగా మారింది.
భారీ టికెట్ ధరలతో రిలీజైన పుష్ప2(pushpa2) సాధించిన సుమారు 1.50 కోట్ల టికెట్ సేల్స్‌కు ఇరుముడి అత్యంత చేరువగా నిలిచింది. దీంతో రవితేజకు ఉన్న మాస్ ఆడియన్స్ కనెక్షన్ మరోసారి స్పష్టమైంది. కలెక్షన్లతో పాటు థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇరుముడి రన్‌కు ఈ ఫుట్‌ఫాల్స్ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.








