టైటిల్ సాంగ్ తో యూత్ ను పడేస్తున్న ఏమో ఏమో ఇది!
యూత్ ను టార్గెట్ చేస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఏమో ఏమో ఇది(Emo emo idi) సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజైంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేమలోని అందమైన అనుభూతులను, కొత్తగా పరిచయమైన జంట మధ్య కనిపించే కెమిస్ట్రీని ఈ సాంగ్ లో చూపించారు. ముఖ్యంగా కశ్మీర్ అందాలు సాంగ్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మంచుతో కప్పుకున్న కొండలు, ప్రకృతి అందాల మధ్య రోషన్ మేక(Roshan meka), ప్రీతి ముకుందన్(preethy Mukundan) జోడీ స్క్రీన్‌పై చూడముచ్చటగా కనిపించింది.
హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham Abdhul wahab) ట్యూన్ చేసిన ఈ సాంగ్ కు మెలోడీ ప్రధాన బలంగా నిలిచింది. కార్తీక్(Karthik), రమ్య బెహరా(Ramya Behera) తమ గాత్రంతో సాంగ్‌కు ప్రేమను, ఎమోషన్ ను జోడించారు. కృష్ణకాంత్(Krishna kanth) రాసిన సాహిత్యం కూడా సాంగ్‌లోని రొమాంటిక్ ఫీల్‌ను మరింత పెంచింది. రోషన్ తన లుక్స్‌తో ఆకట్టుకోవడంతో పాటు కొన్ని క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో కూడా మెప్పించాడు. ప్రీతి ముకుందన్తో అతని జోడీ ఫ్రెష్‌గా అనిపిస్తోంది.
శైలేష్ కొలను(Sailesh kolanu) రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Fortune Four Cinemas) బ్యానర్లపై నాగవంశీ ఎస్(S Naga vamsi), సాయి సౌజన్య(Sai Soujanya) నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్(Srikara Studios) సమర్పిస్తోంది. వంశీ పచ్చిపులుసు(Vamsi Pachipulusu) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ టైటిల్ సాంగ్ సినిమాపై ఉన్న రొమాంటిక్ క్యూరియాసిటీని మరింత పెంచగా, సినిమా అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి రానుంది.








